బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కరోనా

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మరికొన్ని రోజుల్లో షురూ కాబోతుంది. ఈసారి కరోనా కారణంగా కంటెస్టెంట్స్ ను రెండు వారాల ముందుగానే పార్క్ హయత్ లో ఐసోలేషన్ చేశారు. ఐసోలేషన్ కు ముందే అందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కూడా రెగ్యులర్ గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి పరీక్షలో అందరు కూడా నెగటివ్ రిపోర్ట్ తో బయటకు వచ్చారు. అయితే ఇటీవల జరిపిన రెండవ సారి టెస్ట్ లో ఒక సింగర్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట.

ఆ సింగర్ ఎంట్రీతో తప్పకుండా మంచి ఫైర్ ఉంటుందని ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కాని ఆయన కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో నిర్వాహకులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారట. అయితే షో ప్రారంభం అయ్యే సమయానికి అతడికి నెగటివ్ వస్తే ఖచ్చితంగా అతడిని తీసుకుంటారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అతడు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ ను కలవలేదట. కనుక వారి విషయంలో ఎలాంటి టెన్షన్ అయితే లేదు అంటున్నారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా సురేఖ వాణి.. పూనమ్ భజ్వా.. అలేఖ్య.. గంగవ్వ.. రఘు మాస్టర్ దంపతులు.. నోయల్.. లాస్య.. అరియానా.. కరాటే కళ్యాణి. వీరు ఇప్పటికే ఐసోలేషన్ కు వెళ్లారని అంటున్నారు. అయితే ఫైనల్ జాబితా మాత్రం షో ప్రారంభం అయ్యే రోజు వరకు తెలిసే అవకాశం లేదు.