మరి అంత బలుపు పనికిరాదు బ్రో.. అఖిల్ పై బిగ్ బాస్ అభిమానుల పంచ్లు

0

బిగ్ బాస్ సీజన్ 4 కాస్త మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమయినా.. రాను రాను ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం మోనాల్ ట్రైయాంగిల్ లవ్ ట్రాక్. మోనాల్ తో అఖిల్ .. అభిజీత్ లవ్ ట్రాక్ నడపడం.. ఆమె కోసం వాళ్లిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడటం చూస్తున్నాం. అయితే కేవలం వీళ్ల లవ్ ట్రాక్ కోసమే బిగ్బాస్ను చూసేవారూ ఉన్నారు. అయితే ఈ క్రమం లో అఖిల్ ప్రవర్తన మాత్రం మొదటి నుంచి కాస్త వివాదంగా ఉంది. అతడి మాటలు ప్రవర్తనలో కాస్త పొగరు ధ్వనిస్తుందని బిగ్బాస్ చూసే ప్రేక్షకులు ఫేస్బుక్లో ఎన్నోసార్లు కామెంట్లు పెట్టారు. ‘మరీ అంత బలుపు పనికి రాదు బ్రో’అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అఖిల్ దర్జాగా కొనసాగుతున్నాడు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ ఘటన మాత్రం హౌస్ కొంపముంచినట్టు ఉంది..

ఇంతకీ ఏం జరిగిందంటే.. గత వారం కమెడియన్ కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హౌస్లో ఒక్కొక్కరి గురించి విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఐతే అఖిల్ గురించి చెబుతూ.. ‘టాస్కుల్లో అఖిల్ ఫుల్ ఎనర్జీగా ఆడుతున్నాడు. బాగా కష్టపడుతున్నాడు కూడా.. కానీ ఫెయిలవుతున్నాడని.. అలాగే ప్రయత్నించాలని అన్నాడు’ అని చెప్పాడు. దీనికి వెంటనే అఖిల్ రియాక్ట్ అయిపోయాడు. ‘నువ్వు టాస్కుల్లో గెలిచినా కూడా బయటికి వెళ్లిపోయావు బ్రో’ అంటూ పంచ్ వేశాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఓ వ్యక్తిపై అఖిల్ అలా కౌంటర్ వేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో తొందర్లోనే అఖిల్ కూడా బయటకు వెళ్లిపోయే సమయం ఆసన్నమైనట్టుందని ప్రేక్షకులు కౌంటర్లు వేస్తున్నారు.