Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిబి4 : రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ నామినేషన్

బిబి4 : రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్ నామినేషన్


రెండు వారాలుగా సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్స్ మొహాలకు ఉన్న మాస్క్ లను మొన్నటి శని ఆదివారాల ఎపిసోడ్ లో పూర్తిగా తీయడం జరిగింది. నాగార్జున సేఫ్ గేమ్ ఆడటం సెల్ఫ్ నామినేషన్ వంటి పిచ్చి పనుల వల్ల గేమ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఒకరిపై ఒకరికి ఎంతగా ఉంది కోపం బయటకు ఎలా ఉంటున్నారు అనే విషయాలను ఆ ఎపిసోడ్ ల్లో క్లారిటీగా చూపించారు. దాంతో నిన్నటి నుండి మొత్తం రచ్చ రచ్చగా ఉంది. మూడవ వారంలో మొదటి రోజు అయిన నిన్న ఎక్కువ శాతం ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్ ను టెలికాస్ట్ చేశారు. అంతుకు ముందు అరియానా సోహెల్ ల గొడవ.. హారిక దివిల ముచ్చట్లు చూపించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది.

గత వారం ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి బిగ్ బాంబ్ ద్వారా టవీ9 దేవిని ఈ వారం డైరెక్ట్ గా నామినేట్ చేసింది. దాంతో దేవి మొదట నామినేషన్ లోకి వెళ్లి పోయింది. ఇక కెప్టెన్ అయిన నోయల్ కు ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దాంతో లాస్యను నోయల్ నామినేట్ చెప్పి దివి విషయంలో ఆమె వ్యవహరించడం సరైనది కాదేమో అన్నట్లుగా అనిపించింది అంటూ కారణం చెప్పాడు. అలా ముందే దేవి మరియు లాస్యలు ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వగా నోయల్ కెప్టెన్ అవ్వడం వల్ల ఎలిమినేషన్ నుండి ఉపశమనం పొందాడు. మిగిలిన వారిలో నుండి అందరు వచ్చి ఎవరిని ఎలిమినేషన్ కు నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది.

ఎక్కువ మంది కుమార్ సాయి ఫొటోను మంటల్లో వేశారు. ఆయన ఇంకా కలవడం లేదు అని చెప్పడంతో పాటు రకరకాల కారణాలు చెప్పారు. ఆ తర్వాత మెహబూబ్ మరియు మోనాల్ లకు కూడా ఎక్కువ మంది ఎలిమినేషన్ కు ఓటు వేశారు. అలా మొత్తంగా ఈ వారంలో ఏడుగురు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. వారు దేవి.. లాస్య.. కుమార్ సాయి.. మోనాల్.. మెహబూబ్.. అరియానా.. హారిక. లాస్య మరియు అరియానాలు మొదటి సారి ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈ వారంలో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప కుమార్ సాయి సేవ్ అవ్వడం కష్టం అన్నట్లుగా ఉంది. ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు అంటూ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. కనుక ఆయనకు ఓట్లు పడటం అనుమానమే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.