Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఆచార్య’లో చరణ్ వాట నామమాత్రమే

‘ఆచార్య’లో చరణ్ వాట నామమాత్రమే


మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’ ని రామ్ చరణ్ నిర్మించాడు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి నాన్న చిరంజీవితో వరుసగా సినిమాలు నిర్మించాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే మెగా 151ను కూడా చరణ్ నిర్మించాడు. సైరా నరసింహారెడ్డి అంటూ చరణ్ నిర్మించిన ఆ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా కలెక్షన్స్ పరంగా నిరాశ పర్చింది. ఆ సినిమా కారణంగా రామ్ చరణ్ నష్టాలు చవి చూశాడనే టాక్ వచ్చింది. సైరా తర్వాత సినిమాను కూడా చరణ్ నిర్మించాలని భావించాడు. ఆచార్య ప్రకటించిన సమయంలో చరణ్ మాత్రమే నిర్మాత అన్నారు.

ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభంకు ముందు నిర్మాణంలో కొరటాల శివకు సన్నిహితుడు అయిన నిరంజన్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. మొదట చరణ్ మరియు నిరంజన్ రెడ్డిలు సమాన భాగస్వామ్యంతో పెట్టుబడితో సినిమాను నిర్మిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చరణ్ ఈ సినిమా నిర్మాణం నుండి తప్పుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే చరణ్ తప్పుకున్నట్లుగా వచ్చిన వార్తలను నిరంజన్ రెడ్డి కొట్టిపారేశారు. ఆచార్య నిర్మాణంలో చరణ్ కూడా భాగస్వామి అన్నారు.

ఇప్పుడు మరోసారి ఆచార్య నిర్మాణ వ్యవహారాల గురించి చర్చలు జరుగుతున్నాయి. సినిమాను ఇప్పటి నుండే అమ్మేస్తున్నారట. ఆ విషయాల గురించి చరణ్ ఏం పట్టించుకోవడం లేదట. ఆ కారణంగానే చరణ్ ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను నామమాత్రంగానే చూసుకుంటున్నాడు. సినిమాలో నిర్మాతగా కాకుండా ఆయన పేరును సమర్పకుడిగా కూడా వేస్తారని తెలుస్తోంది. ఇక లాభాల వాటా విషయంలో కూడా చరణ్ కు నామమాత్రపు వాటానే ఉంటుందని అంటున్నారు. సైరా ఫలితం తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆచార్య సినిమాకు చరణ్ పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరించలేక పోతున్నాడు.