టాలీవుడ్ యంగ్ హీరోకి కోవిడ్-19…?

0

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మనదేశంలో కూడా కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడటంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ – ఐశ్వర్యారాయ్ కరోనాని జయించగా అభిషేక్ బచ్చన్ ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు. మన టాలీవుడ్ లో కూడా చాలామంది కరోనా బారిన పడ్డారు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కరోనాకి చికిత్స తీసుకొని బయటపడ్డాడు. స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు సింగర్ స్మితలకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఓ యువ హీరో కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

కాగా టాలీవుడ్ లో ఈ మధ్య వరుస హిట్స్ కొడుతూ మంచి ఫార్మ్ లో ఉన్న ఓ యంగ్ హీరోకి కరోనా సోకిందంట. ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక పార్టీకి హాజరైన ఆ హీరోకి గత కొన్ని రోజులుగా ఫీవర్ తో బాధపడ్డాడట. ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని వెంటనే తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అయిపోయి క్వారంటైన్ లో ఉన్నాడట. తన ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో ఇన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న సదరు యువ హీరో.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడట. అయితే ఆ టెస్టులలో కరోనా నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడట. కరోనా లక్షణాలు కనిపించినప్పటి నుండి ఎవరికీ చెప్పని ఆ హీరో.. ఇప్పుడు తనకి నెగిటివ్ అని కంఫర్మ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తులతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ యంగ్ హీరో కరోనా వ్యవహారం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.