నటవారసుడు కాని మెగా నటవారసుడు ఏం చేస్తాడో మరి?

0

నటవారసుల గురించి దేశమంతా ఆసక్తికర చర్చ సాగుతోంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత వేడెక్కిస్తున్న ఏకైక చర్చ ఇది. ఇలాంటి సమయంలో కుటుంబ నేపథ్యం ఉన్న హీరోలు ఎవరు బరిలో దిగినా నెపోటిజం అంటూ కామెంట్లు వినిపించడం కామన్ గా మారింది.

అదేంటో కానీ .. మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో పరిచయం కావాలంటే దానికి వీళ్లెవరూ సపోర్టు చేస్తున్నట్టే అనిపించదు. తెరవెనక ఉండి కొందరికి బూస్ట్ ఇచ్చినా కానీ అంతగా తెరముందుకు వచ్చి పబ్లిసిటీ చేయరు. సత్తా ఉంటే నిరూపించుకో. ఆ తర్వాత నిలబెట్టుకో!! అనేదే వీళ్ల ప్రిన్సిపల్ గా కనిపిస్తుంటుంది. సాయి తేజ్.. వరుణ్ తేజ్ లాంటి హీరోలు తమకు తాముగానే నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్న వైనం చూస్తున్నదే.

ఇదంతా సరే కానీ.. కొణిదెల ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో వస్తున్నాడు అంటూ ఓ ప్రచారం ఇటీవల హైలైట్ అయ్యింది. చరణ్ కి తమ్ముడు వరుస అంటూ పవన్ తేజ్ కొణిదెలను పరిచయం చేశారు. `ఈ కథలో పాత్రలు కల్పితం` అంటూ టైటిల్ ని ప్రకటించారు. ఇందులో మేఘన.. లక్కి నాయికలు. అభిరామ్ ఎం. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా తాజాగా కొత్త మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసింది చిత్రబృందం. ఆకాశం నుంచి హైదరాబాద్ సిటీ అందాలను అలా షూట్ చేస్తూ సింగిల్ షాట్ లో పవన్ తేజ్ పంచ్ చూపించి ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకున్నారు. త్వరలో సినిమా రిలీజ్ కానుంది. అదంతా సరే కానీ.. కొణిదెల అనేది టైటిల్ కార్డ్ వరకేనా? ఈ కుర్రాడిలో మ్యాటర్ ఎంత? అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకూ చూడాలి. ఇక చరణ్ కి తమ్ముడు అంటూ ప్రచారం సాగితే అదంతా ఒత్తిడిని పెంచుతుంది. ఆ రేంజులో డ్యాన్సులు.. ఫైట్స్ .. నటనలో ఏమాత్రం తగ్గకూడదు మరి. నటవారసుడు కాని నటవారసుడు ఏం చేస్తాడో మరి?