దివ్య శ్రీపాద ఎవరీ తెలుగమ్మాయ్?

By TeluguNow . | 27 Nov 2020

లఘు చిత్రాలతో ఫేమస్ అయ్యి పెద్ద తెర అవకాశాలు అందుకుంటున్న స్టార్లు ఉన్నారు. ఇప్పుడు అదే కేటగిరీలో ఓ తెలుగమ్మాయి వెండితెరకు దూసుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగమ్మాయిల్లో ప్రతిభకు కొదవేమీ లేదు. అందానికి అందం ప్రతిభ ఉన్నా అవకాశాలు రాక వెనకబడేవారే ఎక్కువ.

కానీ లఘు చిత్రాలతో పరిచయమైన తెలుగమ్మాయి దివ్య శ్రీపాద తనదైన అందం ప్రతిభతో ఆకర్షిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. ఓటీటీ రిలీజ్ లకు సిద్ధమవుతున్న ‘మిస్ ఇండియా’.. ‘కలర్ ఫోటో’.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాల్లో ఈ భామ సహాయక పాత్రల్లో నటించింది. ప్రధాన నాయికల్నే డామినేట్ చేసేంత అందం ఆకర్షణ తనలో ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. దివ్య చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. ఉప్పెన బ్యూటీకి చెల్లిలా ఉంది ఎవరీ తెలుగమ్మాయ్? అంటూ ఆరాలు పెరిగాయట పరిశ్రమలో.

తనదైన బ్రిలియన్సీతో స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలు మాత్రమే చూసేవారికి దివ్య తెలియకపోయినా.. లఘు చిత్రాలు వీక్షించే యూత్ కి ఈ తెలుగమ్మాయి సుపరిచితమే. షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చి దర్శి లాంటి నటుడు.. రెజీన .. చాందిని లాంటి నాయికలు పాపులరయ్యారు. అదే తీరుగా ఇప్పుడు ఈ భామ కూడా పాపులరవుతుందని భావిస్తున్నారు.

దివ్య ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలిగారు. ఒకదాని వెంట ఒకటిగా వరుస అవకాశాలను అందుకుంటున్నారు. మునుముందు దివ్యకు పెద్ద ఆఫర్లు వరించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న విశ్లేషణ సాగుతోంది. త్వరలోనే తనను కథానాయికగా చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!

Related Images:

[tn_ads slot="9876543210"]