కుర్రకారులో ‘ఫైర్’ రేపుతున్న మిర్చి సుందరి..!!

0

2013లో “మిర్చి లాంటి కుర్రాడే” అంటూ ప్రభాస్ తో చిందేసి కుర్రకారులో వేడి పుట్టించిన భామ హంసానందిని. తెలుగు పరిశ్రమలో మొన్నటి వరకు ప్రత్యేక పాటలకు మోస్ట్ ఫేవరేట్ గా మారింది. నిజానికి ఐటమ్ సాంగ్స్ అంటే కాస్తో కూస్తో అనే కాకుండా ఊహించని రీతిలో ప్రేక్షకులకు కావాల్సిన అందాలను గుప్పించాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలకు ఐటెం సాంగ్స్ స్పెషల్ అట్రాక్షనుగా నిలుస్తున్నాయి. అలాగే ఐటమ్ సాంగ్స్ పై అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రేక్షకుల అంచనాలు రీచ్ అయ్యే హంగులన్నీ హంసానందినిలో పుష్కలంగా ఉన్నాయి. అంతకుమించి అందం కూడా ఉండటం వల్ల టాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందంతా ఆమెకు మోడలింగ్ మీద మక్కువతోనే ఇంతటి స్థాయికి తీసుకొచ్చిందట.

ప్రస్తుతం సినీ అవకాశాలు లేక మోడలింగునే నమ్ముకుందట సుందరి. కరోనా వలన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ టాలెంట్ తో అభిమానులకు కావలసిన సలహాలు సూచనలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. తాజాగా హంసా బ్యూటీ తన ఫ్యాన్స్ కోసం బ్యూటీ టిప్స్ తో.. పాటు ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన వీడియోలు కూడా రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే అమ్మాయిలకు మేకప్ మెళకువలు నేర్పిస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ గ్లామరస్ వీడియో పోస్ట్ చేసింది. “దిస్ గర్ల్ ఇస్ ఆన్ ఫైర్” అనే బ్యాక్ గ్రౌండ్ పాటతో యూట్యూబ్ ఛానెల్లో రచ్చ లేపుతానంటుంది. బ్లూ కలర్ మినీ డ్రెస్సులో కుర్రాళ్లకు గాల్లో తన అందాలు ఎగిరేస్తూ సెగలు రేపుతోంది. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తన్నట్లు చెప్పింది. ప్రస్తుతం హంసా వీడియో కోసం అభిమానులు రెప్ప వేయకుండా ఎదురు చూస్తున్నారు.

New video….. coming up.. at 6pm today….. Stay tuned …. YouTube 💃

null