హరిప్రియ.. దిగంత్ ‘ఎవరు’

0

అడవి శేషు.. రెజీనా.. నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించిన ‘ఎవరు’ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టిన ‘ఎవరు’ సినిమాను కన్నడంలో రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్ పాత్రలతో కాకుండా కాన్సెప్ట్ కథతో నడుస్తుంది. నటీనటుల నటన ఈ సినిమాకు చాలా కీలకం. కాని కథ మెయిన్ హీరో హీరోయిన్ గా సాగుతుంది అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ ‘ఎవరు’ కన్నడ రీమేక్ లో నటించే నటీనటుల విషయంలో క్లారిటీ వచ్చేసింది.

రెజీనా పోషించిన పాత్రను కన్నడ స్టార్ నటి హరిప్రియ పోషించబోతుంది. తెలుగులో కూడా మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడు కన్నడంలో ఈమద్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక అడవి శేషు పాత్రను దిగంత్ తో చేయించబోతున్నారు. అడవి శేషు లక్షణాలు ఉండటంతో పాటు అన్ని విధాలుగా ఆ పాత్రకు దిగంత్ తప్పకుండా సూట్ అవుతారని మేకర్స్ భావించారట. నవీన్ చంద్ర పాత్రకు ఎవరు ఎంపిక అవుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ‘ఎవరు’ సినిమాను కన్నడ ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆధరిస్తారనే నమ్మకంను మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.