Templates by BIGtheme NET
Home >> Cinema News >> హీరోకి వైరల్ జ్వరం అని లైట్ తీస్కుంటే.. కోవిడ్ 19 అని తేలింది!

హీరోకి వైరల్ జ్వరం అని లైట్ తీస్కుంటే.. కోవిడ్ 19 అని తేలింది!


తకిట తకిట ఫేం హర్షవర్ధన్ రాణే గురించి పరిచయం అవసరం లేదు. టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసి కిమ్ శర్మతో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేసి కొంతకాలం ప్రేమాయణంలో మునిగి.. చివరికి బ్రేకప్ చెప్పాడు. ఆ క్రమంలోనే హర్షవర్ధన్ రాణే పేరు మార్మోగింది.

అతడు COVID-19 చికిత్స కోసం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. 4 రోజుల పాటు ఐసీయులో ఉన్నానని అతడు స్వయంగా వెల్లడించాడు. హర్షవర్ధన్ రాణే ప్రస్తుతం COVID-19 నుండి కోలుకుంటున్నారు. తీవ్రమైన తలనొప్పి జ్వరం వచ్చాక.. చాలా రోజుల పాటు తగ్గకపోవడంతో కోవిడ్ చికిత్స కోసం అతడిని నాలుగు రోజులపాటు ఐసియులో ఉంచారట.

కోవిడ్ -19 తో బాధపడుతున్నప్పుడు బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్న తన తాజా చిత్రం తైష్ విడుదల ప్రమోషన్స్ కి హర్షవర్ధన్ సిద్ధమవుతున్నాడు. అనూహ్యంగా జ్వరంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కరోనావైరస్ కారణంగా తీవ్రమైన తలనొప్పి జ్వరం వచ్చిన తరువాత నాలుగు రోజుల పాటు ఐసియులో చేరినట్లు ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో హరశ్వర్ధన్ వెల్లడించారు.

అతను మొదట వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు ఇది సాధారణ వైరల్ జ్వరం అని డాక్టర్ కొట్టిపారేశాడు. అయినప్పటికీ కొన్ని రోజులు మందులు తీసుకున్న తరువాత కూడా జ్వరం తగ్గలేదు తలనొప్పి వేధించింది. దాంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంతలో కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

హర్షవర్ధన్ మాట్లాడుతూ “నేను నాలుగు రోజులు ఐసియులో ఆక్సిజన్ సపోర్ట్ లో ఉన్నాను. ఈ టైమ్ లో నేను సినిమాను అస్సలు ప్రచారం చేయలేకపోయాననే బాధపడుతున్నాను. ప్రస్తుతం నేను ఇంకా బలహీనంగా ఉన్నాను. ఇది తీవ్రమైన తలనొప్పి స్వల్ప జ్వరంతో ప్రారంభమైంది. నాలుగు రోజులు గడిచినా తలనొప్పి తగ్గనప్పుడు నేను ఒక ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ వారు వైరల్ జ్వరం అని కొట్టిపారేశారు. అయినప్పటికీ వారు COVID-19 పరీక్ష చేసారు. ఇది పాజిటివ్ అని తేలింది. రెండు రోజుల తర్వాత కూడా నాకు జ్వరం తలనొప్పి నుండి ఉపశమనం లభించకపోవడంతో నేను మరోసారి ఆసుపత్రికి వెళ్ళాను. వారు నన్ను వెంటనే ఐసియులో చేర్చారు. ఎనిమిది రోజుల తర్వాతే నా జ్వరం తలనొప్పి తగ్గాయి” అని తెలిపాడు.

తనకు కోవిడ్ అని తెలిశాక తన దర్శకుడు నంబియార్ రోజుకు కనీసం రెండుసార్లు తనను తనిఖీ చేస్తూనే ఉన్నాడని `తైష్` మూవీ టీజర్ తనకు మంచి అనుభూతిని కలిగిస్తోందని అతను చెప్పాడు. హరశ్వర్ధన్ త్వరగా కోలుకోవాలని సహచరులు ఆకాంక్షిస్తున్నారు.