Templates by BIGtheme NET
Home >> Cinema News >> గంజాయి చట్టవిరుద్ధం అయితే ఆన్ లైన్ లో ఎలా అమ్ముతారు?

గంజాయి చట్టవిరుద్ధం అయితే ఆన్ లైన్ లో ఎలా అమ్ముతారు?


భారతదేశంలో చట్టవిరుద్ధం అయితే గంజాయి నూనె లేదా సిబిడి ఆయిల్ ఆన్ లైన్ లో కొనేందుకు అంత సౌకర్యంగా ఎలా అందుబాటులో ఉంటోంది? అనే ప్రశ్నను బాలీవుడ్ కథానాయిక మీరా చోప్రా లేవనెత్తింది. బుధవారం సాయంత్రం మీరా సిబిడి చమురును నెట్ నుండి కొనుగోలు చేయవచ్చని షాపింగ్ వెబ్ సైట్ లో దాని లభ్యతను తనిఖీ చేశానని ట్వీట్ చేసింది.

“ఇప్పుడే అడుగుతున్నాను. సిబిడి ఆయిల్ చట్టవిరుద్ధం అయితే ఆన్ లైన్ లో ఎలా అంత సౌకర్యంగా లభిస్తుంది. అమెజాన్ లో కూడా దాని లభ్యతను నేను తనిఖీ చేసాను. చట్టవిరుద్ధం అయితే ఎందుకు నియంత్రణ లేదు? # సిబిడాయిల్“ అని మీరా తన అధికారిక ఖాతా నుండి ట్వీట్ చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మాదకద్రవ్యాల కోణాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) పరిశీలిస్తున్న తరుణంలో మీరా ప్రశ్న సంచలనమైంది. కొంతమంది ఎ-లిస్ట్ బాలీవుడ్ నటీమణులను ప్రశ్నించడానికి ఎన్.సి.బి పిలిపించిన సంగతి విధితమే.

వేరొకరి ట్వీట్ కు ప్రతిస్పందనగా మీరా ఇలాంటి లాజికల్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహా ఎన్.సిబి ముందు `అంగీకరించినట్లు` ఆమె శ్రద్ధా కపూర్ కోసం గంజాయి నూనెను ఏర్పాటు చేసిందని మరియు ఆన్ లైన్ లో కొనుగోలు చేసిందని ఓ గుసగుసా వినిపించినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ఇదిలా వుండగా మాదకద్రవ్యాల కేసులో ప్రశ్నించినందుకు బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకొనే- సారా అలీ ఖాన్- శ్రద్ధా కపూర్- రకుల్ ప్రీత్ సింగ్ లను పిలిచినట్లు ఎన్.సిబి బుధవారం తెలిపింది. ఆ మేరకు జాతీయ మీడియా కథనాలు సంచలనాలు అయ్యాయి.