ఇండస్ట్రీ చాలా క్రూరమైంది.. అదే ఇంటరెస్టింగ్: ఇలియానా

0

తెలుగు చిత్రపరిశ్రమను కొన్నేళ్ల పాటు తన అందాల ఆరబోతతో షేక్ చేసేసింది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్ సినిమాల్లో మాత్రం తన వయ్యారాలు మాములుగా ఒలికించలేదు. ‘దేవదాస్’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తక్కువ టైంలోనే టాప్ హీరోల సరసన నటించి బాక్సాఫీస్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని పోకిరి జల్సా కిక్ సినిమాలతో అభిమానుల కలలరాణిగా వెలిగిపోయింది. అమ్మడు జులాయి సినిమా తర్వాత పలు సినిమాలు చేసింది కానీ తన రేంజిలో ఆకట్టుకోలేదు. సినీ ఫీల్డ్ అంటే పోటీ ప్రపంచం అని అందరికి తెలిసిందే. కాస్త ఆలస్యం అయినా వెనక్కి పడిపోతుంటారు.

అడపాదడపా తమిళ సినిమాలలో కనిపించిన ఇలియానా.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతో క్రేజ్ పెరిగినప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఆ మధ్య తెలుగులో కేవలం తనను గ్లామర్ పాత్రలకే అంకితం చేసారని అందుకే నాకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరకలేదని వాపోయింది. అయితే తాజాగా అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలియానా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ప్రతిదీ ప్రజలకే వర్తిస్తుంది. ఓ కళాకారిణిగా ప్రేక్షకులు ఎల్లప్పుడూ తమను చూస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీ అనేది చాలా క్రూరమైన ప్రదేశం అనే చెప్పాలి. ప్రజాదరణ విషయంలో పరిశ్రమలో సమతుల్యం లేదని ఆమె చెప్పుకొచ్చింది.

అలాగే ఇండస్ట్రీ చాలా క్రూరమైనది. కానీ ఇక్కడ కేవలం ఎల్లప్పుడూ ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తూ ఉండటం ఇష్టపడతారు. ఒక నటుడికి సరైన గుర్తింపు లభించని సమయంలో వారు తమ మార్క్ కోల్పోతారని.. అదే ప్రాధమిక విషయం అంటోంది ఇలియానా. నేను చూడటానికి ఇష్టపడని నటుడితో సినిమా చూడటానికి నేను ఇష్టపడను. మీకు నచ్చని ఏ నిమిషంలో అయినా మీరు మీ మార్క్ కోల్పోవచ్చు. ఓ కోణంలో ఇండస్ట్రీ చాలా దారుణంగా ఉంది. కానీ ఇక్కడ అలాంటి అంశాలకే ఆదరణ లభిస్తుంది. లైఫ్ లో అన్ని మంచి విషయాలే ఉండకూడదు. అప్పుడప్పుడు కొంచం కరుకైనా విషయాలు కూడా ఉంటాయి. అదికూడా ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. అలాంటి విషయాలే బాగా కష్టపడి పనిచేసేలా చేస్తాయి.” అంటోంది ఇల్లు బేబీ. ప్రస్తుతం అమ్మడు “అన్ ఫెయిర్ అండ్ లవ్లీ” అనే సినిమాలో నటిస్తోంది.