పవర్ స్టార్ రాజీ పడుతున్నారా?

0

ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు వచ్చే వరకు షూటింగ్ లొకేషన్ లో అడుగుపెట్టనని చెప్పిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎట్టకేలకు మెట్టు దిగారు. తన సినిమాల షూటింగ్ల కోసం మొత్తానికి కాంప్రమైజ్ అయ్యారు. కొంత విరామం తరువాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం `వకీల్సాబ్`. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే.

ఈ నెలాఖరు నుంచి ఈ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నారు. షూట్ కి సంబంధించిన ప్లాన్ చేసుకోమని ఇప్పటికే నిర్మాత దిల్ రాజుకి చెప్పేశారట. ఇక 20 రోజుల్లో మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని కండీషన్ కూడా పెట్టారట. దీంతో నవంబర్ నెలాఖరుకి `వకీల్ సాబ్` షూట్ మొత్తం పూర్తయితే పవన్ ఫ్రీ అయిపోతాడు.

అయితే ఆ వెఉంటనే క్రిష్ సినిమా మొదలు కావాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆ సమయంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్`లో పవన్ నటించబోతున్నారట. పాటు కూడా లేకపోవడంతో ఇదే మొదలవుతుందని టాక్. బీజు మీనన్ పాత్రలో పవన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రానాని ఆ ఆత్ర కోసం అడుగుతున్నారు. ఈ రోజే టైటిల్… ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.