ముగ్గురు హీరోయిన్స్ సినిమాలో రాఘవేంద్రరావు హీరో

0

ఇండియన్ సినిమా చరిత్రలో ఏడు పదుల వయసులో ఎనిమిది పదుల వయసులో హీరోలుగా నటించిన వారిని మనం చూశాం. ఇప్పుడు ఎనిమిది పదుల వయసుకు దగ్గర ఉన్న వ్యక్తి హీరోగా అరంగేట్రం ఇవ్వబోతున్నాడు. వంద సినిమాలకు పైగా తెరకెక్కించి లెజెండ్రీ డైరెక్ట్ గా పేరు దక్కించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టాలీవుడ్ మరియు మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రమ్యకృష్ణ.. శ్రియ.. త్రిషలు హీరోయిన్ లుగా నటించబోతున్న ఒక సినిమాలో రాఘవేంద్ర రావు హీరోగా నటించబోతున్నాడు.

ఒకప్పుడు స్టేజ్ పై రెండు ముక్కలు మాట్లాడమంటేనే చాలా మొహమాట పడ్డ రాఘవేంద్ర రావు కాలక్రమేనా బుల్లి తెరపై తన సినిమా అనుభవంను వివరిస్తూ చిత్రలహరి సీజన్ లకు సీజన్ లు చేసిన విషయం తెల్సిందే. అలాగే వందకు పైగా సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు ఒక్క సినిమాలో కూడా కనిపించాలనుకోలేదు. ఒకటి రెండు సార్లు ఆ అవకాశం వచ్చినా కూడా సున్నితంగా తిరష్కరించాడు.

తాను అసలు ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్లాలని భావించలేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాని ఇప్పుడు ఏకంగా హీరోగానే నటించేందుకు సిద్దం అయ్యాడు. ఒక వైపు పెళ్లి సందడి సినిమా చేస్తున్న రాఘవేంద్ర రావు మరో వైపు హీరోగా నటించేందుకు రెడీ అవ్వడం నిజంగా గ్రేట్. 78 ఏళ్ల వయసులో ఆయన ఓపిక మరియు స్టామినాకు మెచ్చుకోవాల్సిందే.