డ్రగ్స్ మత్తులో రణబీర్.. రణవీర్.. హృతిక్.. విక్కీ కౌశల్.. ఇంకా ఎవరు?

0

క్వీన్ కంగన బాలీవుడ్ మత్తు వదిలించేస్తోంది. దశాబ్ధాల పాటు డ్రగ్స్ మత్తులో జోగిపోతున్న ఒక చీకటి ప్రపంచపు రహస్యాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ టీవీ చానెళ్ల ఇంటర్వ్యూలు దంచేస్తోంది. తాజా ఇంటర్వ్యూల కంగన చేసిన వ్యాఖ్య ఒకటి పెను దుమారమే రేపుతోంది.

బాలీవుడ్ డ్రగ్ మాఫియాతో ఇక్కడ చాలా మంది హీరోలకు సంబంధాలున్నాయని.. 90 శాతం మందికి డ్రగ్్స్ కి అలవాటు పడ్డారని వ్యాఖ్యానించిన కంగన అందులో కొన్ని పేర్లను బయట పెట్డడంతో అది కాస్తా అన్ని పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాను డేటింగ్ చేసిన ఒక స్టార్ హీరో డ్రగ్స్ పుచ్చుకుంటాడని పార్టీల్లో అదుపు తప్పుతాడని వ్యాఖ్యానించింది. అతడు ఎవరో చెప్పాల్సిన పనే లేదు. సుజానే ఖాన్ కి విడాకులిచ్చాక హృతిక్ తో డేటింగ్ చేసింది కంగననే. కాబట్టి హృతిక్ మాదక ద్రవ్యాలు సేవిస్తాడని చెప్పకనే చెప్పింది.

అలాగే నటవారసుడు అయిన రణబీర్ కపూర్ తో పాటు రణ్ వీర్ సింగ్.. వికీ కౌశల్ లాంటి హీరోలకు రక్త పరీక్షలు చేయిస్తే డ్రగ్స్ పుచ్చుకుంటారా లేదా అన్నది తెలిసిపోతుంది అని వ్యాఖ్యానించడం విశేషం. చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా లేట్ నైట్ పార్టీల్లో అందరూ డ్రగ్స్ తీసుకుంటారని కంగన వ్యాఖ్యానించింది. కరణ్ జోహార్ సహా స్టార్ కిడ్స్ పార్టీలకు ఎటెండవుతారు. వీళ్లంతా డ్రగ్స్ మత్తులో జోగేవారేనన్నది కంగన అభిప్రాయం. ఇక తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత మహేష్ భట్ తనకు డ్రగ్స్ అలవాటు చేశారని ఇంతకుముందే వెల్లడించింది.

ఇలాంటి రహస్యాలన్నీ తెలిసిన ఔట్ సైడర్ కాబట్టి తనను పార్టీలకు దూరం పెట్టారని బాలీవుడ్ నుంచి బహిష్కరించారని కూడా కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఒక స్టార్ హీరో ఫ్యాన్ కి వేలాడదీయాలని అనుకున్నారని హీట్ పెంచే వ్యాఖ్యల్ని చేసింది. అలాగే బాలీవుడ్ మాఫియా రహస్యాలన్నీ తెలిసిన ఔట్ సైడర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని కూడా నిర్ధయగా బహిష్కరించిందని.. అతడు సూసైడ్ చేసుకోవడానికి కారణం అలాంటి ఒక కఠోర నిజం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు రియా చక్రవర్తి తన జీవితంలో ప్రవేశించాకే డిప్రెషన్ లోకి వెళ్లాడని.. డిప్రెషన్ లోకి వెళ్లినంత మాత్రాన ఎవరూ ఆత్మహత్య చేసుకోరని కూడా వ్యాఖ్యానించింది.