న్యూడ్ ఫొటో షూట్ పై క్లారిటీ ఇచ్చిన హోమ్లీ హీరోయిన్

0

ఈటీవీలో ప్రసారం అయ్యే అలీ టాక్ షో తాజా ఎపిసోడ్ లో నిన్నటి తరం హోమ్లీ హీరోయిన్ కస్తూరి పాల్గొంది. ఆ టాక్ షో లో కస్తూరి పలు విషయాలను షేర్ చేసుకుంది. అప్పుడు నాగార్జున ఇప్పుడు విజయ్ దేవరకొండలు తనకు క్రష్ అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో నటించడంపై స్పందించింది. ఫ్యామిలీ కెరీర్ గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్న కస్తూరి అన్నమయ్య చిత్రంలో నటిస్తున్న సందర్బంగా నాగార్జున గారితో ఎక్స్ పీరియన్స్ ను సరదాగా చెప్పుకొచ్చింది.

ఈ టాక్ షో లో ఆమె తన వివాదాస్పద ఫొటో షూట్ పై స్పందించింది. బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఆ బిడ్డతో న్యూడ్ గా ఒక ఫొటో షూట్ ను కస్తూరి ఇచ్చింది. ఆ విషయంలో చాలా చర్చ జరిగింది. ఒక సౌత్ హీరోయిన్ ఈ స్థాయి న్యూడ్ ఫొటో షూట్ చేయడం అది కూడా బిడ్డను ఎత్తుకుని చేయడం ఏంటీ అంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విషయంలో అప్పుడు పెద్దగా స్పందించని కస్తూరి ఈ టాక్ షో లో స్పందించింది.

తల్లి పాల ప్రాముఖ్యత అవగాహణ కల్పించేందుకు ఆ ఫొటో షూట్ చేశాము. అది ఒక మ్యాగజైన్ కోసం చేయడం జరిగింది. విదేశాల్లో మేము ఉన్న సమయంలో ఆ షూట్ చేశాం. ఇండియా వరకు అది రాకపోవచ్చు అనుకున్నాను. కాని కొందరు దాన్ని లీక్ చేశారు. దాంతో ఇంటర్నెట్ లో అది వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో ఎలాంటి తప్పు లేదు. కాని మన వాళ్లు మాత్రం కాస్త వేరేగా తీసుకున్నారు. మన ఇండియన్ సొసైటీలో అప్పుడు అదో పెద్ద తప్పుగా పరిగణించి నన్ను ట్రోల్స్ చేశారంది. తల్లి పాల ప్రాముఖ్యత తెలియజేయడం కోసమే తాను ఆ ఫొటో షూట్ ఇచ్చానంటూ క్లారిటీ ఇచ్చింది.