సల్మాన్ వారసుడితో కుర్ర హీరోయిన్ ఫికర్

0

సల్మాన్ ఖాన్ వారసుడిగా పాపులరయ్యాడు వరుణ్ ధావన్. సల్మాన్ స్వయంగా తన వారసుడిగా వరుణ్ ని ప్రకటించడంతో అభిమానులు అతడిని జూనియర్ సల్మాన్ అంటూ ఆరాధిస్తున్నారు. ఇంతకీ జూనియర్ తో షికార్లు చేస్తున్న ఈ అమ్మడు ఎవరు? అంటే.. కాస్త వివరాల్లోకి వెళ్లాలి.

ధావన్ ఫేవరెట్ హీరో సల్మాన్. అతడిని విపరీతంగా ఆరాధిస్తాడు. ఇక ఇటీవల భాయ్ నటించిన పలు క్లాసిక్స్ నుంచి రీమేక్ సాంగ్స్ చేస్తున్నాడు. అలాగే సల్మాన్ క్లాసిక్ హిట్ మూవీ జుడ్వా 2 రీమేక్ లో నటించి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఇక కండలు పెంచడంలోనూ గురూజీ సల్మాన్ ని ఫాలో చేస్తుంటాడు ధావన్ బోయ్.

అదంతా సరే కానీ.. జూనియర్ సల్మాన్ తో కియరా అద్వాణీకి ఏం పని? ఇదిగో ఇలా మాస్క్ పెట్టుకుని ఏదో ఆఫీస్ కి వెళ్లి తిరిగొస్తోంది. వరుణ్ ధావన్ చేతిలో స్క్రిప్టు ప్రతులు కనిపిస్తున్నాయి. చూస్తుంటే కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న విషయం అర్థమవుతోంది. ఎవరి రోల్ ఏమిటి? అన్నది కన్ఫామ్ అయ్యాక.. ముందే ప్రాక్టీస్ కి రెడీ అవుతున్నారా? ఏమో..! ఇక వరుణ్ ధావన్ తన గురూజీ సల్మాన్ లా గాళ్ ఫ్రెండ్స్ ని మార్చకుండా ఫిక్స్ డ్ గా నటాషా దళాల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కియరా ఇప్పటికే యువహీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఎఫైర్ సాగించిందన్న గాసిప్స్ షికారు చేసాయి. కియరా వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది.