Templates by BIGtheme NET
Home >> Cinema News >> లింగిడి లింగిడి కోట బొమ్మాలి పీ.ఎస్.. సినిమా వచ్చేస్తుందోచ్..

లింగిడి లింగిడి కోట బొమ్మాలి పీ.ఎస్.. సినిమా వచ్చేస్తుందోచ్..


మలయాళ సూపర్ హిట్ సినిమా నాయట్టు రీమేక్ గా గీతా ఆర్ట్స్ 2 సంస్థలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన సినిమా కోట బొమ్మాలి పీ.ఎస్. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను తేజ మార్ని డైరెక్ట్ చేశారు. ఇదివరకు అతను తీసిన జోహార్ ప్రశంసలు అందుకోగా అర్జున ఫాల్గుణ నిరాశ పరచింది. పవర్ పోలీస్ కి, పొలిటికల్ లీడర్ కి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా కోట బొమ్మాలి పీ.ఎస్ వస్తుంది.

తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనగానే ఈ టైం లో కోట బొమ్మాలి మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. నవంబర్ 24న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ అయిన GA 2 నుంచి ఏ సినిమా వచ్చినా దానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న ఈ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

సినిమాలో శ్రీకాంత్ నటన అద్భుతంగా ఉంటుందని వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈమధ్య తెలుగు సినిమాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ హవా కనిపిస్తుంది. క్రాక్ సినిమా నుంచి ఆమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన మ్యాన్షన్ 24 వెబ్ సీరీస్ లో కూడా ఆమె నటించింది.

మలయాళ సినిమా నాయట్టు అక్కడ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మార్టిన్ ప్రకత్ డైరెక్ట్ చేసిన నాయట్టు సినిమాలో జోజు జార్జ్, నిమిషా సాయం నటించారు. సినిమా నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ తో పాటుగా శ్రీకాకుళం లింగిడి లింగిడి సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ కోట బొమ్మాలి సక్సెస్ కి కారణమవుతుందా లేదా అన్నది చూడాలి.