Templates by BIGtheme NET
Home >> Cinema News >> అతన్ని చూస్తే గర్వంగా ఉంది.. పొలిమేర 2 ఈవెంట్ లో అడివి శేష్..!

అతన్ని చూస్తే గర్వంగా ఉంది.. పొలిమేర 2 ఈవెంట్ లో అడివి శేష్..!


సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఊరి పొలిమేర సినిమా ప్రేక్షకులను సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. సినిమా సక్సెస్ అవడంతో పొలిమేర 2 తెరకెక్కించారు. అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈవెంట్ కి గెస్ట్ గా అడివి శేష్ అటెండ్ అయ్యారు.

పొలిమేర 2 ఈవెంట్ లో పాల్గొన్న అడివి శేష్ డైరెక్టర్ అనిల్ తో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. ఇది తన సొంత సినిమాగా ఉందని నా ఫస్ట్ సక్సెస్ క్షణం టీం కి సంబంధించి చాలామంది ఇందులో ఉన్నారని అన్నారు అడివి శేష్. డైరెక్టర్ అనిల్ తనకు మంచి స్నేహితుడని.. తన కెరీర్ ఎర్లీ స్టేజ్ లో ప్రమోషన్స్ కి రెండు రాష్ట్రాలు తిరిగుతున్న టైం లో బడ్జెట్ లేక అతని ఇంట్లోనే ఉన్నానని అన్నారు అడివి శేష్. అనిల్ క్వాలిఫైడ్ డెంటిస్ట్. అతను సినిమాల్లోకి రాకముందు నా డెంటిస్ట్ అతనే.. అతను ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు వచ్చి నాకు చెబితే నేను డిస్కరేజ్ చేశా కానీ అతను రెండోది మూడో స్క్రిప్ట్ ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేశాడు. అనిల్ ని చూస్తే నాకు గర్వంగా ఉందని అన్నారు అడివి శేష్.

ఎప్పుడైనా మా కష్టాలు చెబుతుంటే మీరంతా మేము రోజు కష్టడతాం అనుకుంటారు. అనిల్ ఎంత కష్టపడ్డాడో చెప్పను కానీ పొలిమేర 1 రీ క్యాప్, పొలిమేర 2 ట్రైలర్ లో అతని కష్టం ఎంత కనిపిస్తుందో చెబుతాను. తన ఆర్ట్, టాలెంట్ ఎంత కనిపిస్తుందో చెబుతాను. ఇట్స్ ఫెంటాస్టిక్ అని అన్నారు అడివి శేష్. నాకు టికెట్ ఇవ్వకపోయినా బుక్ బై షోలో కొనుక్కుని ఈ సినిమా చూస్తానని అన్నారు. ఇక్కడకు పిలిచినందుకు థాంక్స్ ముందుగా కంగ్రాట్స్ అనిల్ అని చెప్పారు అడివి శేష్.

తను సినిమాల్లో కొత్తగా ట్రై చేస్తున్న టైం లో తన ఫస్ట్ సినిమా ఆడియో లాంచ్ కి సత్య రాజేష్ హోస్ట్ గా చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించారు. టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి ఈ సినిమా చేశారని అన్నారు అడివి శేష్. హీరోయిన్ కామాక్షి పొలిమేర 1 కి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేశారట. ఈ సినిమాకు హీరోయిన్ గా నటించారు. కళ్లతో ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అద్భుతమని అన్నారు. గూఢచారికి ప్రోగ్రామింగ్ చేసిన గ్యాని ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. అందుకే ఇది నా సొంత సినిమాలా ఉందని అన్నారు అడివి శేష్. నవంబర్ 3న సినిమా రిలీజ్ అవుతుంది అందరు తప్పకుండా సినిమా చూడాలని అన్నారు అడివి శేష్. ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన మా ఊరి పొలిమేర 2 సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పరచుకుంది.