ప్రముఖ నటుడికి మాఫియా బెదిరింపులు

0

బాలీవుడ్ కు అండర్ వరల్డ్ మాఫియాకు దగ్గరి సంబంధాలున్నాయన్న సంగతి చాలా సార్లు బయటపడింది. చాలా మంది నటులకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇక చాలా మంది నటులకు ముంబై మాఫియా నుంచి బెదిరింపులు వస్తుంటాయి.

ప్రముఖ నటుడు దర్శకుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ కు తాజాగా గ్యాంగ్ స్టర్ అబుసలేం గ్యాంగ్ కు చెందిన సభ్యుడిగా చెప్పుకుంటూ మహేష్ ను బెదిరించాడు. తనకు 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మంజ్రేకర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా తనకు వచ్చిన రెండు మెసేజ్ లను పోలీసులకు ఫిర్యాదులో మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఈ కేసును ముంబై పోలీస్ కు చెందిన దోపిడీ నిరోధక విభాగానికి బదలాయించారు.

కాగా కరోనా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన 34 ఏళ్ల వ్యక్తి అబూ సలేం ముఠా సభ్యుడిగా పేర్కొంటూ మహేష్ మంజ్రేకర్ ను బెదిరించినట్టు పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. నిందతుడిని మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లా కు చెందిన మిలింద్ తుసంకర్ గా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.