గౌతమ్ పుట్టిన రోజున మహేష్ ఎమోషనల్ ట్వీట్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇద్దరు పిల్లల విషయంలో ఎంత ప్రేమ చూపిస్తాడో మనం రెగ్యులర్ గా కూడా చూస్తూనే ఉన్నాం. నమ్రత సోషల్ మీడియాలో మహేష్ బాబు మరియు పిల్లల బాండ్డింగ్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక నేడు మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. నేడు గౌతమ్ కు 14వ పుట్టిన రోజు సందర్బంగా నెట్టింట పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.

మహేష్ బాబు కూడా కొడుకు గౌతమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. హ్యాపీ 14 మై సన్. నీ ఎదుగుదుల చూస్తుంటే గర్వంగా ఉంది. డోరామన్ నుండి అపెక్స్ లెజెండ్స్ వరకు నీతో పాటు ఎదిగిన జర్నీ సూపర్. ఎప్పటికి సంతోషంగా ఉండాలి లవ్ యూ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు తన ఒడిలో ఉన్న గౌతమ్ ఫొటోను మరియు ఇప్పుడు ఎదిగిన తర్వాత ఫొటోను రెండింటిని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అర్థరాతి సరిగ్గా 12 గంటల సమయంలో మహేష్ బాబు ఈ ట్వీట్ చేశాడు. 50 వేల లైక్స్ మరియు 15 వేల కామెంట్స్ తో అభిమానులు ఈ ట్వీట్ ను వైరల్ చేశారు.