మహేష్ ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడా…?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ ను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ అనే రెండు సినిమాలు వచ్చాయి. ‘అతడు’ సినిమా సక్సెస్ అందుకున్నప్పటికీ ‘ఖలేజా’ నిరాశపరిచింది. అయితే ‘ఖలేజా’ సినిమాతో మహేష్ లోని కామెడీ యాంగిల్ బయటకి వచ్చిందని చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా ఎప్పుడు టీవీలో ప్రసారం అయినా మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో మూవీ వస్తే బాగుండు అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని వార్తలు వస్తున్నాయి.

కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఈ దొరికిన సమయంలో త్రివిక్రమ్ మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇటీవల మహేష్ ని కలిసి త్రివిక్రమ్ స్టోరీ చెప్పాడని.. మహేష్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. అంతేకాకుండా ఈ సినిమా ‘సీతారామపురం’ అనే టైటిల్ తో రాబోతుందని.. 1967లో వచ్చిన ‘ప్రాణమిత్రులు’ సినిమా స్టోరీ లైన్ తో ఉండబోతోందని అంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉండటంతో ఈ గ్యాప్ లో మహేష్ మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మహేష్ – త్రివిక్రమ్ వార్తలు నిజమైతే ఎప్పుడు సాధ్యపడుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మహేష్ సినిమా స్టార్ట్ చేస్తాడా లేదా అంతకంటే ముందే ‘సర్కారు వారి పాట’తో ప్యారలల్ గా ఈ సినిమా చేసారా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు – త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.