డ్రైవర్ లీకుల వల్లనే ఆ జంట విడిపోయారా?

0

మాజీ భర్త అర్బాజ్ ఖాన్ డ్రైవర్ కు మలైకా అరోరా డ్రైవర్ తన రహస్యాన్ని లీక్ చేశాడా? అంటే అవుననే గుసగుసలు బాలీవుడ్ లో హీటెక్కిస్తూనే ఉన్నాయి. తన గురించి అర్జున్ కపూర్ గురించి తన సోదరుడు బాబ్లూ (అర్బాజ్ ఖాన్ డ్రైవర్) కు తన ప్రైవేట్ సమాచారాన్ని లీక్ చేశాడని మలైకా అరోరా తన డ్రైవర్ ముఖేష్ ని అనుమానించేవారని టాక్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది.

గత సంవత్సరం నుండి మలైకా అర్జున్ బీచ్ లో ఒకరిపై ఒకరు తమ ప్రేమను బహిరంగంగా చాటింపు వేశారు. అర్జున్ తో ఎఫైర్ కి సంబంధించిన ప్రతి ఫోటో లీకయ్యాయి. ఆ ఇద్దరూ తరచుగా వారి వయస్సు వ్యత్యాసంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నా.. అదేమీ పట్టనట్టు వ్యవహరించారు.

అర్జున్ -మలైకా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం పట్ల సల్మాన్ ఖాన్ అలానే బోనీ కపూర్ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారమైంది. అర్జున్ ని అతడి తండ్రి బోనీలను కూడా తన ఇంటిలోనికి ప్రవేశించకుండా సల్మాన్ నిషేధించాడని కథనాలొచ్చాయి.

అయితే ఈ లీకులన్నీ ఎవరి వల్ల బయటికి వచ్చాయి? అంటే.. అర్జున్ తో తనకున్న సంబంధం గురించి మలైకా తన డ్రైవర్ ముఖేష్ ఆయన సోదరుడు బాబ్లూకు లీక్ చేశాడని అనుమానించారట. ముఖేష్ మరియు అతని సోదరుడు బాబ్లూను రిక్రూట్ చేసుకుంది అర్బాజ్. వారిని ఇరువురికి డ్రైవర్లుగా నియమించినది ఆర్బాజ్ ఖాన్ నే.

ముఖేష్ మలైకా డ్రైవర్ .. బాబ్లూ అర్బాజ్ కోసం డ్రైవర్ గా పని చేశాడు. ఇద్దరు డ్రైవర్లు ఆ జంట విడిపోయిన తర్వాత కూడా మాజీ జంట కోసం పని కొనసాగిస్తున్నారట. మొత్తానికి ఆ ఇద్దరి వల్లనే అన్ని విషయాలు బయట లీకులు అందాయన్నది మలైకా అనుమానమట.