50 ఏజ్ కి దగ్గరవుతున్నా దుమారమేగా మలైకా

0

మలైకానా మజాకానా? తాను ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉండాల్సిందే.. అంతకుమించి కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేసి తీరాల్సిందేనన్న కసి కనిపిస్తుంటుంది. ఇదిగో ఇలా తన పెట్ డాగ్ ని వాకింగ్ కి తీసుకొచ్చిన మలైకా దుమ్ము రేపేసిందంతే. మలైకా అరోరా తన డాగ్ తో కలిసి నడవడానికి వెళ్ళేటప్పుడు సింపుల్ అండ్ హాట్ మోనోక్రోమ్ దుస్తులను ఎంచుకుంటుంది.

మలైకా అరోరా నగరంలో అడుగుపెట్టినప్పుడల్లా ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకత వెలుగు చూస్తుంది. ఇది కూడా ఆ తరహానే. బాలీవుడ్ ఫ్యాషనిస్టాల్లో మిలియన్ల మంది స్టైల్ ఐకాన్ లుగా భావించే మలైకా ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో చెలరేగుతూనే ఉందిలా.

సాంప్రదాయిక దుస్తులే అయినా లేదా ఆధునికం డిజైన్ అయినా మలైకా దాని రేంజును అమాంతం పెంచేస్తుంది. మలైకా ఇటీవల తన 47 వ పుట్టినరోజును జరుపుకుంది. ఆమె చక్కటి వైన్ ఎంత లేట్ అయితే అంతగా కిక్కిస్తుంది అన్నచందంగా అసలు వృద్ధాప్యం అన్నదే లేని స్టార్ గా వెలిగిపోతోంది. 40 కి చేరువలోనూ దుమారం రేపుతోంది. పప్పీతో జాగింగ్ కి వెళ్లినప్పుడు COVID-19 పరిస్థితి కారణంగా తన హెయిర్ ని సింపుల్ గా ముడివేసి ప్రస్తుత నియమ నిబంధనలకు కట్టుబడి మాస్కును ధరించింది.

ఇటీవలే తాను కూడా COVID-19 తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో సమాచారం ఇవ్వడంతో అభిమానులు సహా తన ప్రియమైన వారు ఆందోళన చెందారు. అయితే మహమ్మారీ నుంచి కోలుకుని అందరికీ సంతోషం నింపింది. యువహీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న కారణంగా ఆమె కొంతకాలంగా వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ ఇప్పుడు ఒక సంవత్సరానికి పైగా ఒకరితో ఒకరు డేటింగ్ లో ఉన్నారు. వివిధ సంఘటనలు సందర్భాలలో కలిసి కనిపించారు. గత ఏడాది అర్జున్ తో కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత మలైకా తమమధ్య బాంధవ్యంపై బహిర్గతమైంది.