మాళవిక.. ఎరుపెక్కిన ఓనమ్ పండగ

0

మాళవిక మోహనన్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇటీవల వరుసగా తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా యమ స్పీడ్ చూపిస్తోంది. ఇక ఈ అమ్మడి ర్యాంప్ వాక్ షోలకు ఇప్పటికీ యూట్యూబ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

నేటితరం నాయికల్లో హాట్ అప్పియరెన్స్ తో పాటు నటన పరంగా ట్యాలెంట్ ఉన్న అమ్మడిగా మాళవిక మోహనన్ పాపులరైంది. ప్రముఖ ఛాయాగ్రాహకుని వారసురాలిగా ఇండస్ట్రీలో చక్కని పరిచయాలు.. దానికి తగ్గట్టే మాళవిక ఆఫర్లు అందుకుంటోంది. త్వరలో తెలుగు సినీపరిశ్రమకు ఈ అమ్మడి ట్రీట్ షురూ కానుంది.

అదంతా సరే కానీ.. ఈ కేరళ కుట్టి నేడు ఓనం పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంది? అంటే.. ఇదిగో ఈ ఫోటో చూస్తే తెలిసిపోతుంది. రెడ్ లో ఓనం ఎరుపెక్కిపోయింది మరి. రెడ్ హాట్ శారీలో మాళవిక మోహనన్ ఇచ్చిన ఈ లుక్ అదిరిపోయింది. ఈ ఎర్ర చీర తన ఫేవరెట్ అని చెప్పింది అమ్మడు. ప్రస్తుతం ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది ఈ ఫోటో. మరో కేరళ కుట్టి నయనతార అదిరిపోయే లుక్ తో కనిపించింది ఈరోజు. ప్రియుడు విఘ్నేష్ తో కలిసి కోచ్చి విమానాశ్రయంలో దిగింది నయన్.