నైసుగా గుండెను కోసేయకు మలయాళ మారుతమా

0

మాళవిక మోహనన్ .. మలబారు తీరం నుంచి సినీపరిశ్రమకు పరిచయమై ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తొలిగా తమిళ పరిశ్రమను చాప చుట్టేస్తోంది. అక్కడ క్రేజీ స్టార్ హీరోలు ఈ అమ్మడినే వెతుక్కుంటూ వెళుతున్నారు. అంతగా ఈ అమ్మడిలో ఏం ఉంది. అంటే అందానికి అందం సెక్సప్పీల్ అని చెబితే తప్పేమీ కాదు.

కళ్లతోనే కోటి భావాల్ని పలికిస్తూ బోల్డ్ అప్పియరెన్స్ తో మెంటలెక్కించడం ఈ అమ్మడి ప్రత్యేకత. తాజాగా ఈ భామ షేర్ చేసిన సోషల్ మీడియా ఛాయాచిత్రం యూత్ లో జోరుగా వైరల్ అవుతోంది. ఇక ఆ అందాన్ని మెచ్చి అగ్ర హీరోలే ఈ భామ వెంట పడుతున్నారు. ఇలయదళపతి విజయ్ సరసన మాస్టార్ చిత్రంలో నటిస్తూనే.. ఎనర్జిటిక్ ధనుష్ సరసన నెక్ట్స్ సినిమా చేస్తానని ప్రకటించేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పేటా` చిత్రంతో మాళవిక తమిళ పరిశ్రమకు పరిచయమైంది. ఈ అమ్మడు సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీ వర్గాలకు సుపరిచితం.

ప్రస్తుతం హిందీలో సిద్ధాంత్ చతుర్వేదికి కమిటైంది. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఇది పూర్తవ్వక ముందే మాళవికను ఫర్హాన్ మరో ప్రాజెక్టుకు లాక్ చేస్తున్నాడని తెలిసింది. క్రైసిస్ కొన్నిటికి బ్రేక్ వేసింది కానీ అసలు మాళవిక ఇస్పీడ్ కి టాలీవుడ్ అయినా షేకవ్వాల్సిందే. దేవరకొండతో హీరో మిడిల్ డ్రాప్ అయ్యింది కానీ ఈపాటికే ఇక్కడ మరింతగా పాపులరయ్యేది. అదీ సంగతి.