Templates by BIGtheme NET
Home >> Cinema News >> 50 వచ్చేస్తున్నా లేడీ విలన్ 16 ప్లస్ వేషాలు

50 వచ్చేస్తున్నా లేడీ విలన్ 16 ప్లస్ వేషాలు


ఆమె వయసు 48. అర్థ సెంచరీకి కూతవేటు దూరమే. అయినా కానీ ఆమె వేషాలు చూస్తే 16 ప్లస్ అని అంగీకరిస్తారు. స్టన్నింగ్ ఫోజులతో కుర్రకారుకు బౌన్సర్లు వేయడంలో ఎక్స్ పర్ట్ ఈ కిల్లింగ్ లేడీ. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి? అంటే.. సాహో లేడీ విలన్ మందిరా భేడీ గురించే. ఏజ్ లెస్ బ్యూటీగా మతులు చెడగొట్టే మందిర మ్యాడమ్ మరీ ఇలా సిక్స్ టీన్ వేషాలేమిటో! అంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు మరి. మ్యాడమ్ ప్లీజ్ కాస్త ఆ స్పీడ్ తగ్గించరూ? అంటూ ఒకటే ఇదవుతున్నారు.

అన్నట్టు మందిర ప్రొఫైల్ సంగతి అటుంచితే వ్యక్తిగత జీవితంలో మరో కోనం ఆద్యంతం ఎంతో ఎమోషనల్ అనే చెప్పాలి. మందిరా బేడి బాలీవుడ్ నిర్మాత రాజ్ కౌషల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వీర్ జన్మించాడు. ఈ ఏడాది జూలైలో తారా అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు. తారా మధ్యప్రదేశ్ లోని టికామ్ ఘర్ నుంచి వచ్చింది. మందిరా అక్టోబర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. దత్తత గురించి ఒక అందమైన నోట్ రాస్తూ “ఆమె మా వద్దకు వచ్చింది…. పైనుండి వచ్చిన దిగొచ్చన వరం లా.. మా చిన్న అమ్మాయి తారా. నాలుగు సంవత్సరాలు ..తనకు. నక్షత్రాల మాదిరిగా మెరిసే కళ్ళతో మరిపిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమతో తన ఇంటికి స్వాగతం… తారా బేడి కౌషల్. 28 జూలై 2020 న మా కుటుంబంలో భాగమైంది“ అంటూ వెల్లడించారు.

మందిరా.. ఆమె భర్త రాజ్ కౌషల్ మధ్య కూర్చున్న తారా చిత్రాన్ని ఇంతకుముందు ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు. ఈ జంట తొమ్మిదేళ్ల కుమారుడు వీర్ ను కూడా ఫ్రేమ్ లో చూడవచ్చు.