సింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ కామెంట్స్..!

0

ఇటీవల సింగర్ సునీత – మ్యాంగో రామ్ వీరపనేని వివాహం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ ఆలయంలో శనివారం రాత్రి.. సన్నిహితులు కొద్దిమంది సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు. అయితే ఇప్పుడు సునీత పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే.. మరొకొందరు సునీత రెండో పెళ్లిని విమర్శిస్తున్నారు. సునీత పెళ్లి ఫోటోలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి విమర్శలు చేసేవారికి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చాడు.

”సంతోషం అనేది పుట్టుకతో ఉండదు. రాదు. దాన్ని మనం వెతుక్కోవాలి. రామ్ – సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు కంగ్రాట్స్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేసే వారికి.. కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదాహరణగా మీ జంట నిలిచింది.. ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్ గా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అని నాగబాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇంతకముందు సినీ విమర్శకుడు కత్తి మహేష్ సైతం సునీత పెళ్లిని ట్రోల్ చేస్తున్న వారిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.