గారాల మనుమరాలిని ముద్దు చేస్తున్న మెగాస్టార్…!

0

మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లల పట్ల ఎంతటి ఆప్యాయతను చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు అనేక సందర్భాల్లో మెగా కాంపౌండ్ లోని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన విషయాలు షేర్ చేసుకున్నారు. ఇటీవల తన మనుమరాలు.. శ్రీజా – కళ్యాణ్ దేవ్ దంపతుల కుమార్తె నవిష్కతో చిరు సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. నవిష్కను చిరు తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ‘మిమీ మిమ్మి’ అంటూ గారాభం చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఈ క్రమంలో శ్రీజ మొదటి సంతానంగా జన్మించిన మెగా మనవరాలు నివృత పట్ల చిరు ప్రేమను కురిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా నిన్న మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు చిరుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అందులోనూ నిన్న వినాయక చవితి పండుగ కావడంతో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి సురేఖ.. కొడుకూ కోడలు రామ్ చరణ్ – ఉపాసన లతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో గారాల మనుమరాలు నివృత నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఫోటో.. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్న ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. నివృత ఈ ఫోటోలను ఇటీవలే ఓపెన్ చేసిన ట్విట్టర్ ఖాతా వాల్ పై పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు మురిసిపోతూ నివృత అప్పుడే ఇంత పెద్దమ్మాయి అయిందా.. శ్రీజ – కళ్యాణ్ దేవ్ పెళ్ళిలో చాలా చిన్నమ్మాయిలా కనిపించిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.