నల్ల మబ్బులో మెరిసెను మేఘా అందం

0

`లై` తో టాలీవుడ్ కి పరిచయమైంది మేఘా ఆకాష్. నితిన్ కి తగ్గ సరిజోడు అంటూ అంతా పొగిడేశారు. బొద్దుగా ముద్దుగా కవ్వించిన ఈ భామలో డీసెన్సీ కుర్రాళ్లకు నచ్చేసింది. ఆ క్రమంలోనే యూత్ స్టార్ నితిన్ ఈ ముద్దుగుమ్మకు రియల్ గానే పడిపోయాడని నిండా లవ్ లో ఉన్నాడని ప్రచారమైంది. `చల్ మోహనరంగా` చిత్రంలోనూ ఈ అమ్మడికే ఆఫర్ దక్కింది. కానీ నటించిన రెండూ ఫ్లాపులే.

ఆ తర్వాత సీన్ కోలీవుడ్ కి షిఫ్టయ్యింది. తమిళంలో అడుగు పెట్టి అక్కడ క్రేజీ స్టార్ల సరసన నటించింది. ధనుష్ లాంటి స్టార్ హీరో సరసన నటించింది. అలాగే గౌతమ్ మీనన్ తీసిన ఒక స్పెషల్ సాంగ్ వీడియో లో మేఘ మెరుపులు మెరిపించింది. బూమరాంగ్ – శాటిలైట్ శంకర్ (హిందీ)… ఎన్నయ్ నోకి పాయుమ్ తోట.. ఒరు పక్కా కథయ్.. యుధుమ్ ఊయిరే యావరమ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే `మను చరిత్ర` అనే తెలుగు చిత్రంలోనూ ఆఫర్ దక్కిందని ప్రచారం సాగినా దానిపై క్లారిటీ లేదు.

తాజాగా మేఘ ఆకాష్ సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఫోటోషూట్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. నల్ల మబ్బులో దాగిన అందం ఇదిగో ఇలా ఓపెన్ అయినట్టుగా కనిపించింది. మిల్కీ నిగనిగలతో మెరిసిపోతున్న మేఘ పర్ఫెక్ట్ బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయింది. మునుపటిలా అదే బొద్దుతనంతో ముద్దొచ్చేస్తోంది. ఆ బ్లాక్ డిజైనర్ మఖమల్ డ్రెస్ పై తెల్లని చుక్కలు మరింతగా తన అందాన్ని ఇనుమడింపజేశాయి.