మహేష్ సినిమాలో విలన్ గా నటించడానికి సిద్ధపడిన విజయ్…!

0

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు – ఇళయదళపతి విజయ్ కలిసి నటించబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. స్టార్ డమ్ పరంగా ఫాలోయింగ్ పరంగా ఇద్దరూ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు గౌరవ భావంతో మెలుగుతుంటారు. మహేష్ సూపర్ హిట్ సినిమాలు తమిళ్ లో విజయ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ డైరెక్టర్ మురగదాస్ మహేష్ – విజయ్ లతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది. ‘స్పైడర్’ సినిమా సమయంలో పలు ఇంటర్వ్యూలో మురగదాస్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ‘స్పైడర్’ మూవీ ప్లాప్ అవడంతో ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ న్యూస్ బయటకి రాలేదు. ఇక లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూపించడానికి ప్రయత్నాలు చేసారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియన్ సెల్వమ్’ సినిమాలో ముందుగా మహేష్ – విజయ్ లను నటింపజేయాలని మణిరత్నం భావించారు. దీనికి స్టార్ హీరోలిద్దరూ ఓకే చెప్పినప్పటికీ.. అనుకోని కారణాల వల్ల వీరి కాంబోలో మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. దీంతో విక్రమ్ – జయం రవి – కార్తిలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మురగదాస్ మహేష్ – విజయ్ లతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన విషయాన్ని వెల్లడించారట. మహేష్ బాబు హీరోగా విజయ్ విలన్ గా.. ఓ బైలింగ్వల్ మూవీని తెరకెక్కించాలనుకున్నారట మురగదాస్. ఇక ఈ ఐడియాకి ఇంప్రెస్ అయిన మహేష్ – విజయ్ ఇద్దరూ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. అయితే ఈ సందర్భంగా విజయ్ ఓ కండిషన్ పెట్టారట. మహేష్ బాబు హీరోగా నటిస్తేనే తాను తెలుగులో విలన్ గా చేస్తానని.. ఒకవేళ వేరే హీరో అయితే ఈ ప్రాజెక్ట్ లో యాక్ట్ చేయనని విజయ్ తేల్చిచెప్పారట. ఒకవేళ ‘స్పైడర్’ సినిమా హిట్ అయ్యుంటే ఈ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్ మీదకి వెళ్ళేదేమో. ఇక ఎప్పటికైనా మహేష్ కి సూపర్ హిట్ చిత్రాన్ని ఇస్తానని.. అందుకే తన ట్విట్టర్ వాల్ లో ‘స్పైడర్’లోని మహేష్ బాబు స్టిల్ ని చేంజ్ చేయకుండా ఉంచానని మురుగదాస్ ఓ సందర్భంలో చెప్పాడు. మరి రాబోయే రోజుల్లో మహేష్ – విజయ్ లతో మూవీ తీసి బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తాడేమో చూడాలి.