యంగ్ ప్రొడ్యూసర్ కం హీరో లవర్ ఇప్పుడేం చేస్తోంది?

0

నర్గీస్ ఫక్రీ.. ఇండో వెస్ట్రన్ బ్యూటీ ప్రస్తుతం ఏం చేస్తోంది? అప్పట్లో యష్ చోప్రా కుమారుడైన ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసిందని ప్రచారమైంది. కానీ ఆ తర్వాత ఆ డేటింగ్ వ్యవహారం కనుమరుగైనట్టే ఈ అమ్మడు కూడా బాలీవుడ్ కి దూరమైపోయింది. అక్కడ అవకాశాలు ఏమంత పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఈ బ్యూటీ ఎక్కువగా విదేశీ విహారయాత్రల వరకే పరిమితమైంది. ఇటీవల ఈ అమ్మడు గన్ షూటింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా నర్గీస్ ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేసి దానికి అంతే ఆసక్తికరమైన క్యాప్షన్ ని ఇచ్చింది. ఇక ఇందులో ఒక సింపుల్ ఫ్లోరల్ ఫ్రాకులో కనిపించిన అమ్మడు. `మీరు ఇప్పుడు ఆశించిన వాటిలో ఒకప్పుడు మీరు మాత్రమే కలిగి ఉన్నారని మీరు గుర్తుంచుకోనిదాన్ని కోరుకోవడం ద్వారా మీ వద్ద ఉన్నదాన్ని పాడుచేయవద్దు` అనే వ్యాఖ్యను జోడించింది.

ఇంతియాజ్ అలీ – రన్బీర్ కపూర్ల `రాక్ స్టార్` మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఇండో అమెరికన్ బ్యూటీ మోడలింగ్ రంగంలో పాపులర్ అయ్యాక కింగ్ ఫిషర్ మోడల్గానూ ఓ రేంజ్లో రచ్చ చేసింది. హాలీవుడ్ మూవీ `స్పై` థ్రిల్లర్ తో పాటు హిందీ- ఇంగ్లీష్- తమిళ చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం `టోరబాజ్` చిత్రంలో నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది. ఇదిలా వుంటే కరోనా కారణంగా ముంబై వదిలేసిన నర్గీస్ ఫక్రీ ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో వుంటోంది. ఇటీవలే జోషువా నేషనల్ ట్రీ పార్క్ లో సందడి చేసిందట. దీనికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ముళ్ల చెట్ల మధ్య అందాలు ఒలికిస్తూ ఫొటోలకి పోజులిచ్చింది.