జాతిరత్నాలు ట్రైలర్ లాంచ్ చేయనున్న పాన్ ఇండియా స్టార్!

0

మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాతగా మారి రూపొందించిన సినిమా జాతిరత్నాలు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ముస్తాబైన జాతిరత్నాలు మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ‘ఏజెంట్ ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి కమెడియన్స్ ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాతో నూతన దర్శకుడు కే.వి అనుదీప్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా అనే అందమైన కుర్ర హీరోయిన్ కూడా తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ అవుతోంది. అయితే డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న నాగ్ అశ్విన్ నిర్మించేందుకు రెడీ అయ్యాడంటేనే ఈ సినిమా పై స్పెషల్ అట్రాక్షన్ మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే అతని పై నమ్మకం అలాంటిది. మరో విషయం ఏంటంటే తమ సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు అందరికి మాస్కులు కూడా అందించనున్నట్లు నాగ్ తెలిపాడు.

అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న జాతిరత్నాలు ట్రైలర్ గురించి ప్రేక్షకులకు ఓ అప్డేట్ అందింది. అదేంటంటే.. జాతిరత్నాలు ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం కూడా స్వయంగా నాగ్ అశ్విన్ ప్రకటించాడు. కానీ ఎప్పుడు ఎక్కడ అనే విషయాలు చెప్పలేదు. విడుదలకు పెద్దగా లాంగ్ టైం లేదు కాబట్టి ఈ వారంలోనే ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. జాతిరత్నాలు సినిమా హక్కులకోసం పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ పోటీపడి భారీ ధర ఆఫర్ చేసినప్పటికి మా సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నట్లు నాగ్ ఇటీవలే వెల్లడించిన విషయం విదితమే. చూడాలి మరి నాగ్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవుతాడా లేదా అనేది.