ఓవర్ నైట్ సెలబ్రిటీ సందు చూసి చెలరేగుతోందిగా

0

వివాదంతో ప్రచారం కిక్కిస్తుందా? అందుకేనా ఈ ఫోజులు? అంటూ పాయల్ ఘోష్ పై విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఇక వేధింపుల ఆరోపణలతో అప్పటివరకూ మర్చిపోయిన ఈ అమ్మడిని అంతా ఓమారు గుర్తు చేసుకున్నారు. ఇటు టాలీవుడ్ లోనూ పాయల్ పై ఆసక్తికర చర్చ సాగింది. ఇక ఇదే అదనుగా చూశారుగా.. ఇలా చిట్టి పొట్టి నిక్కర్లలో ఫోటోషూట్లతో చెలరేగిపోతోంది ఈ భామ. ఏం చేసినా ఇదంతా అవకాశాల కోసమే. కమర్షియల్ ప్రకటనల ఆదాయం కోసమే సుమీ. ఇక పాయల్ వివాదం అప్ డేట్ పరిశీలిస్తే… లోతుల్లోకి వెళ్లాలి.

కశ్యప్ పై వేధింపుల ఆరోపణలు.. ఇందులో పాయల్ ఘోష్ వర్సెస్ రిచా చాధా ఎపిసోడ్స్ తెలిసినదే. తప్పుడు వ్యాఖ్య చేశాను అని అంగీకరిస్తూనే మతలబు పెట్టింది పాయల్. దీంతో చద్దాకి దిమ్మ తిరిగిపోయింది. ఘోష్పై చాధా దాఖలు చేసిన పరువు నష్టం దావాకు సంబంధించి వారి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ‘సమ్మతి నిబంధనలు’ దాఖలు చేయడానికి రిచా – పాయల్ ఘోష్ లకు బొంబాయి హైకోర్టు రెండు రోజుల సమయం మంజూరు చేసింది.

గత వారం చద్దాపై నిరాధారమైన అసభ్యకరమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఘోష్ పై దావా వేసింది. నష్టపరిహారంగా 1.1 కోట్ల ద్రవ్య పరిహారాన్ని కోరింది చద్దా. దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన పాయల్ .. రిచా సహా మరో ఇద్దరు కథానాయికల్ని కూడా వివాదంలోకి లాగడం కలకలం రేపింది. ఇక ఈ గొడవలో కోర్టు ముఖంగా క్షమాపణ చెప్పినట్టే చెప్పిన పాయల్.. తాను ఎప్పుడూ క్షమాపణ చెప్పనని తన సోషల్ మీడియాలో అనడంపై చర్చ సాగుతోంది.

ఘోష్ తన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నారని .. క్షమాపణలు చెబుతోందని తన తరపు లాయర్ పునరుద్ఘాటించాడు. కాని కొన్ని షరతులతో మాత్రమే అని పిటింగ్ పెట్టడం వేడెక్కిస్తోంది. అయితే ఆ ఇద్దరూ గొడవ పడకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని కోర్టు కోరుతోంది. సమ్మతి నిబంధనలను దాఖలు చేయడానికి బుధవారం (అక్టోబర్ 14) తదుపరి సమయం ఇవ్వబోమని కోర్టు తెలిపింది.గత వారం ఆమోదించిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొనసాగించింది. దీని ద్వారా వాదిపై ఎటువంటి తప్పుడు లేదా అవమానకరమైన ప్రకటనలు చేయకుండా వ్యక్తులను నిరోధించింది.

2013 లో కశ్యప్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఘోష్ ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి విధితమే. అక్టోబర్ 1 న పోలీసులు అతనిని ప్రశ్నించినప్పుడు కశ్యప్ ఈ ఆరోపణలను ఖండించారు. ఆరోపించిన సంఘటన జరిగిందని చెప్పబడిన సమయంలో అతను శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నానని చూపించడానికి డాక్యుమెంట్ ద్వారా ఆధారాలను అందించాడు.