టాలీవుడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పూజాహెగ్డే

0

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది పూజా హెగ్డే. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది. అలానే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే యూత్ ఫుల్ మూవీలోనూ పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన టాలీవుడ్ ని పొగుడుతూనే సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

“తెలుగు ప్రేక్షకులు సినిమాలను అమితంగా ప్రేమిస్తారు. స్టార్స్ ను దేవుళ్లుగా పూజిస్తారు. ఓ తెలుగు సినిమా రూ.200 కోట్లను వసూళ్లు చేస్తున్నాయంటే కారణం ప్రేక్షకులే. ఓ సినిమాను చాలా ఇష్టపడితే మళ్ళీ మళ్ళీ చూస్తారు. నేను సినిమా విడుదలైన రోజున సినిమాను చూడటానికి ఇష్టపడతారు. సినిమాను స్టార్స్ ను ఎంతగా ప్రేమిస్తారంటే థియేటర్ కు డ్రమ్స్ తో వచ్చి డ్యాన్స్ చేస్తారు. పేపర్లు చల్లుతారు. సినిమా అంటే వాళ్లకి ఓ పండుగే” అని తెలుగు ప్రేక్షకులను ఆకాశానికి ఎత్తింది పూజాహెగ్డే. నటిగా తనని తాను నిరూపించుకోవడానికి తెలియని విషయాలను తెలుసుకోవడానికి టాలీవుడ్ ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడింది.

అదే సమయంలో ”సౌత్ ఇండియన్ సినిమా వాళ్లు నావెల్(నడుము) మత్తులోనే ఉంటారని మిడ్ డ్రెస్ లలో తమని చూడాలనుకుంటారు” అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె ఈ కామెంట్స్ నవ్వుతూనే చేసినప్పటికీ దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్టార్ హీరోయిన్ ని చేసిన సౌత్ ఇండస్ట్రీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటప్పుడు దక్షిణాది చిత్రాల్లో నటించంకుండా బాలీవుడ్ లోనే నటించాలని సూచిస్తున్నారు. మరి దీనిపై పూజాహెగ్డే వివరణ ఇస్తుందేమో చూడాలి. ఇంతకముందు హీరోయిన్ తాప్సి కూడా టాలీవుడ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.