పవన్ రోలెక్స్ వాచ్ రేటు

0

పవన్ ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా పవన్ గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ నడుస్తుంది. సింప్లిసిటీకి మారు పేరు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అంటూ అభిమానులు చెబుతూ ఉంటారు. దాంతో గతంలో ఒక సారి పవన్ యాంటీ ఫ్యాన్స్ ఆయన చెప్పుల గురించి సోషల్ మీడియాలో చర్చ పెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా లేదంటే ఫామ్ హౌస్ లో ఉన్నా ఆయన వేసుకునే చెప్పుల ఖరీదు వేలల్లో ఉంటుంది అంటూ గతంలో ప్రచారం జరిగింది. సింప్లిసిటీగా ఉండే వ్యక్తి అంతటి ఖరీదైన చెప్పులు ధరిస్తాడా అంటూ కొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన రోలెక్స్ వాచ్ గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది.

పవన్ రోలెక్స్ వాచ్ ధరించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్ షూటింగ్ గ్యాప్ లో ఏదో పేపర్లపై రాస్తూ చదువుతూ ఉన్న పవన్ కళ్యాణ్ చేతికి రోలెక్స్ వాచ్ ఉంది. ఆ ఫొటోలను షేర్ చేసి సింప్లిసిటీ అంటూ ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ రూ.40 లక్షల విలువైన వాచ్ ను ఎలా ఉపయోగిస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కొందరు స్పందిస్తూ ఆయన వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ కోసం కాస్ట్యూమ్స్ ధరించి ఉన్నాడు. కనుక రోలెక్స్ వాచ్ కూడా పాత్ర కోసమే ధరించి ఉంటాడు. అంతుకు మించి ఉండదని పవన్ ఎప్పుడు కూడా రోలెక్స్ వాచ్ ధరించాలనే ఆసక్తిని కనబర్చడు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. మొత్తాని పవన్ పెట్టుకుని ఉన్న రోలెక్స్ వాచ్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యింది.