వైరస్ కే చెమటలు పట్టేలా ఏమిటో చేపకళ్ల ప్రణీత

0

తెలుగు సినీపరిశ్రమలో ఎవరిని ఏ అదృష్టం ఎలా వరిస్తుందో.. ఎవరిని ఏ రకంగా దురదృష్టం వెక్కిరిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. ఊహకతీతంగా జరిగేదే డెస్టినీ. ఆ రకంగా చూస్తే నిన్న మొన్న వచ్చిన రష్మికతో పోలిస్తే ప్రణీతకు ఏం తక్కువని? అందం లేదా..? ప్రతిభ చాలదా? సమయానుకూలంగా లక్ చిక్కలేదంతే. స్టార్ హీరో సరసన నటించినా పెద్ద బంపర్ హిట్ కొట్టేసినా కానీ ప్రణీతకు ఎందుకనో ఇక్కడ పది పెద్ద బ్యానర్లు పిలిచి అవకాశాలివ్వలేదు. బల్క్ చెక్ లు అందుకోలేదు.

అందుకే ఆ నిరాశ ఇప్పటికీ ఈ అమ్మడిని వదిలి పెట్టలేదు. పవర్ స్టార్ సరసన `అత్తారింటికి దారేది` లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించినా కలిసి రాకపోవడంతో అది చేపకళ్ల ప్రణీతలో తీవ్ర అసంతృప్తికే కారణమైంది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా నటించినా కన్నడ రంగానికే పరిమితమైంది. అక్కడ అయినా చెప్పుకోదగ్గ పెద్ద స్టార్ అయితే కాలేకపోయింది ఎందుకనో.

ఇటీవల వీలున్నప్పుడల్లా రిబ్బన్ కటింగుల కోసం .. అవార్డ్ ఫంక్షన్ల కోసం హైదరాబాద్ లో అడుగుపెడుతోంది తప్ప సినీ ఆఫర్ల కోసం అయితే వస్తున్నట్టు లేదు. ఏదైతేనేం.. ఇదిగో ఇలా విమానాశ్రయంలో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఏ షూటింగుకి వెళుతోందో కానీ.. టాప్ టు బాటమ్ పీపీఈ కిట్ తరహాలో ఇదిగో ఇలాంటి స్పెషల్ సూట్ ధరించింది. బహుశా వీటిని విమానం దిగగానే డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సేఫ్టీ కోసం అలా డ్రెస్ పైన తొడుక్కుందన్నమాట. ముక్కుకు మాస్క్ కళ్లకు అద్దాలు ధరించి సేఫ్ గానే ప్రయాణం చేస్తోంది. ఇంతకీ ఎక్కడికి వెళుతోంది? విమానంలో 4 అడుగుల దూరం మెయింటెయిన్ చేసిందా లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. ఇక ప్రస్తుత ప్రాజెక్టుల సంగతికొస్తే హిందీలోనే ఓ రెండు సినిమాలు చేస్తోంది. భుజ్- ది ప్రైడ్.. హంగామా 2 చిత్రాలతో బిజీ. రమణ అవతార అనే కన్నడ చిత్రంలోనూ నటిస్తోంది.