ధృవ్ మూవీలో హీరోయిన్ గా సోషల్ మీడియా సెన్షేషన్

0

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఆధిత్య వర్మ (అర్జున్ రెడ్డి తమిళ రీమేక్) తో పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ధృవ్ ప్రస్తుతం రెండవ సినిమా ఏర్పాట్లలో ఉన్నాడు. ప్రస్తుతం ధృవ్ ఒకేసారి రెండు సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఒక సినిమాను నాన్నతో కలిసి చేయబోతున్నాడు. అందులో విక్రమ్ విలన్ గా నటించబోతున్నాడు. ఇక రెండవ సినిమా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ వద్ద సుదీర్ఘ కాలంగా అసోసియేట్ గా చేస్తున్న రవికాంత్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా ఆయన కెరీర్ లో చాలా కీలకం కాబోతున్నాయి. ఈ సినిమాల ఫలితాన్ని బట్టి ఆయన సినీ కెరీర్ మరింతగా పైకి వెళ్లడం లేదంటే కిందకు జారడం జరుగుతుంది. అందుకే ఈ రెండు సినిమాలకు చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధృవ్ హీరోగా రవికాంత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ ను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది.

ఒక్క సినిమాతో అది కూడా సినిమాలోని రెండు షాట్స్ తో ఆల్ ఇండియా స్టార్ డంను దక్కించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ రెండవ సినిమా శ్రీదేవి బంగ్లాలో నటించింది. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. ఆమద్య తెలుగులో నితిన్ కు జోడీగా ఈమె ఎంపిక అయ్యిందని.. బన్నీ సినిమాలో నటించబోతుందని ప్రచారం జరిగింది. కాని అన్ని పుకార్లే అని తేలిపోయింది. ఇప్పుడు ధృవ సినిమాలో మాత్రం ఈమె ఖచ్చితంగా నటించబోతుందని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి జోడీ అదిరి పోతుందని ఇద్దరు కూడా లేత వయసులో ఉన్నారు కనుక వయసు రీత్యా కూడా జోడీ అదిరి పోతుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.