ఆ స్టార్ మహిళా క్రికెటర్ బన్నీకి పిచ్చ ఫ్యాన్ అట!

0

అల్లు అర్జున్ స్టయిల్ కి చిరునామా. డ్యాన్స్ లో అయితే ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నాడు. చూస్తుండగానే అల్లు అర్జున్ క్రేజ్ ఫీక్స్ కి చేరింది. ఇప్పుడు అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కేరళ రాష్ట్రంలో మాత్రం భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అక్కడి స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఇమేజ్ అల్లుఅర్జున్ కు ఉంది. అల్లు అర్జున్ సినిమా విడుదల అవుతుందంటే కేరళలో ఫాన్స్ సందడి మామూలుగా ఉండదు. అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అల్లు అర్జున్ కు బాలీవుడ్ తో పాటు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ స్టైల్ డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ అయితే అల వైకుంఠ పురములో సినిమాలోని అన్ని పాటలకు డాన్స్ వేసి టిక్ టాక్ లో వీడియోలను అప్లోడ్ చేశాడు. అలా ఒక్కసారి కాదు పలుమార్లు తన భార్యతో కలసి చిందేశాడు.పలువురు బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు అల్లు అర్జున్ ‘బుట్ట బొమ్మ ‘సాంగ్ కు కాలు కదిపారు. తాజాగా ఇండియన్ మహిళా క్రికెటర్ తాను అల్లు అర్జున్ కు వీరాభిమానినని చెప్పడంతో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

భారత మహిళా క్రికెటర్ ప్రియా పూనియా భారత వన్డే జట్టులో సభ్యురాలు. ఆమె దేశం తరఫున పలు వన్డే మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ఒకరు ప్రశ్నించగా.. తాను అల్లు అర్జున్ కి పిచ్చ ఫ్యాన్ అని ప్రియా వెల్లడించింది. బన్నీ స్టైల్ డ్యాన్స్ తెగ నచ్చుతాయని తెలిపింది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రియా పూనియా చిట్ చాట్ ని స్క్రీన్ షాట్స్ తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తమ స్టార్ హీరో రేంజ్ ఇది అని తెగ ట్వీట్లు చేస్తున్నారు.