సల్మాన్ దెబ్బకు పంజాబీ ఐశ్వర్యారాయ్ కన్నీరు

0

పుట్టినరోజు వేళ స్టార్ హీరో సల్మాన్ ని తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది సదరు నటి. ఆయన పదే పదే అసభ్యంగా మాట్లాడి అవమానించాడని ఆరోపిస్తూ వలవలా ఏడ్చేయడంతో బర్త్ డే కాస్తా శాడ్ డే అయ్యింది. ఇంతకీ ఎవరీ భామ? అంటే…

`బిగ్ బాస్` హౌస్ మేట్ హిమాన్షి ఖురానా అకా పంజాబ్ ఐశ్వర్య రాయ్. రియాలిటీ ఇంటి సభ్యుల ముందు తనను సల్మాన్ పదేపదే అవమానించడంతో ఆమె పేరు ఆ సీజన్ లో మర్మోగింది. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా హిమాన్షి అదే విషయాన్ని ప్రస్థావిస్తూ వలవలా ఏడ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అయింది. ఆమెను ఓదారుస్తూ పక్కనే ప్రియుడు అసిమ్ రియాజ్ .. మాజీ బిగ్ బాస్ హౌస్మేట్ అసిమ్ రియాజ్ కూడా ఈ వేడుకలో కనిపించారు. తాజా కలయికతో ఈ జంట బ్రేకప్ ఊహాగానాలకు ముగింపు పలికారు.

తన పుట్టినరోజు వేడుకల వీడియోను పంచుకుంటూ హిమాన్షి ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాశాడు. “జబ్ జిందగీ సే హోప్ హాయ్ చోర్డి థి కి …… .. కోయి అప్నా హొగా …… యు బోయ్స్ కోయి తకాత్ హ్మే అలగ్ ని కర్ స్కిటి“ అంటూ ఎమోషన్ అయ్యింది. తనకు ఇంత బాధ కలిగించిన విషయాన్ని హిమాన్షి వివరించడంతో వీడియో ఆమె అభిమానులను కదిలించింది. ఫ్యాన్స్ ఆమెకు సంఘీభావం తెలిపారు.

కలర్స్ టీవీ రియాలిటీ షో గత ఎపిసోడ్స్ లో పాల్గొంటున్నప్పుడు హిమాన్షి – అసిమ్ కలిశారు. బిగ్ బాస్ ఇంటి లోపల వారు ప్రేమలో పడ్డారు. అక్కడ హోస్ట్ సల్మాన్ ఖాన్ అనేక సందర్భాల్లో ఆమెను అవమానించారు. పంజాబ్ కు చెందిన ఐశ్వర్య రాయ్ ని తిట్టేస్తూ సల్మాన్ అలా అసభ్యంగా ప్రవర్తించటానికి కారణం ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు.

చాలా కాలం క్రితం చండీఘర్ సమీపంలోని ఒక గ్రామంలో తన వాహనం టైర్లను కత్తిరించడం ద్వారా తన శత్రువులు తనను దెబ్బ కొట్టాలని చూశారని హిమాన్షి అప్పట్లో ఒక బాంబు పేల్చింది. వినోద పరిశ్రమలో పనిచేయడం మానేసేలా తనను భయపెట్టడానికి ఇదే ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. మొత్తానికి సల్మాన్ భాయ్ ఏడిపించినా కానీ ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోలేదు. ఇప్పటికీ ఈ అమ్మడు గుర్తు చేసుకుంటూనే ఉంది. జీవితాంతం మర్చిపోలేదేమో!