ఊరి చివర ఇంట్లో వయసొచ్చిన అమ్మాయి.. షాకింగ్ విషయాలు చెప్పిన పూరి.. దేశంలో ఇలాంటివి కూడానా?

0

లాక్‌డౌన్ వేళ సినిమా షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోడ్‌కాస్ట్ ఆడియోలతో తన అభిప్రాయలు, దేశ విదేశాల సంస్కృతీ సంప్రదాయాలను బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఆడియో ద్వారా ఆయన చెప్పిన విషయాలు వింటే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే. దేశవిదేశాల్లో ఉన్న సంప్రదాయాలు, వాటి మధ్య వ్యత్యాసాలు చెబుతూ అన్నీ ఓపెన్‌గా బయటపెట్టారు పూరి జగన్నాథ్. మరి ఆ సంప్రదాయాలేంటో ఆయన మాటల్లోనే విందామా..

”ఆల్ ఓవర్ ది వరల్డ్ రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి. మడగాస్కర్‌లో మలాగసి అనే ఒక గిరిజన తెగ ఉంది. ఎవరైనా చనిపోతే హ్యాపీ సెండాఫ్ పేరుతో ఆ శవాన్ని గాల్లో ఎగరేస్తూ స్మశానానికి తీసుకెళ్తారు. అలాగే కర్ణాటకలో శంతానేశ్వరీ టెంపుల్ ఉంది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను 50 అడుగుల ఎత్తున్న గుడిపై నుంచి కిందకు వేస్తారు. క్రింద ఉన్న పేరెంట్స్ దుప్పట్లో ఆ బేబీని పట్టుకోవాలి. గుడ్ లక్ అంటారట దాన్ని. ఇక బ్రెజిల్‌లో ఎనమము ట్రైబ్‌లో ఎవరైనా చనిపోతే ఆ బూడిదను తినేస్తారు. కంజుమింగ్ ది డెడ్.

ఇండోనేషియాలో డెడ్ బాడీని దహనం చేయరు. డెడ్ బాడీకి ఒక రకమైన కెమికల్ పూసి శవాన్ని ఇంట్లోనే పెట్టుకుంటారు. మంచి బట్టలేసి, కళ్లద్దాలు పెట్టి ఓ మూలన కూర్చోబెడతారు. అప్పుడుడప్పుడూ ఆ డెడ్ బాడీస్ సెల్ఫీలు కూడా దిగుతారు. చైనా సంప్రదాయం.. కడుపుతో ఉన్న భార్యను ఎత్తుకొని భర్త నిప్పుల్లో నడుస్తాడు. అలా నడిస్తే నార్మల్ డెలివరీ అవుతుందని వారి నమ్మకం.

Also Read: బాబోయ్! ఇరగదీసిన ప్రగతి.. కత్తిలాంటి స్టెప్పులకు గ్లామర్ డోస్‌ యాడ్ చేస్తూ షేక్ చేసింది.. వీడియో వైరల్

నేపాల్‌లో ఒక ట్రైబల్ విలేజ్‌లో ఊరికి చివరన ఒక ఇల్లు ఉంటుంది. వయసొచ్చిన అమ్మాయి పెళ్లి డిసీజన్ కోసం దాన్ని వాడతారు. ఊళ్ళో పెళ్లికాని కుర్రాళ్లందరితో ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఒక్కో రాత్రి గడిపి ఆ తర్వాత నచ్చినోడిని పెళ్లాడుతుంది. స్త్రీ ఫ్రీడమ్. రోమన్ జిప్సీస్‌లో ఎవరైనా అమ్మాయిని కిడ్నాప్ చేసి ఓ 5 రోజులు ఆ పిల్లను దాచగలిగితే ఆ పిల్ల మీ సొంతం. హాయిగా పెళ్లి చేసుకోవచ్చు. ఎవ్వరూ అడ్డు చెప్పరు.

ఇకపోతే వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో కొన్ని ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి. ప్రతి ఏడాది రవిక ఫెస్టివల్ చేసి అక్కడ ఓ వింత ఆచారం కనిపిస్తుంది. ఫుల్లుగా తాగేసి వైఫ్ ఎక్స్‌చేంజ్ మెథడ్ ఫాలో అవుతారు” అంటూ ఎవ్వరికీ తెలియని చాలా రహస్యాలు బయటపెట్టారు పూరి. అయితే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అంటూ ఒకరి ట్రెడిషన్ చూసి మరొకరం నవ్వుకుంటాం కానీ మనందరం ట్రైబల్సే అని అన్నారు పూరి.