#HBD #PJ37 గుర్తు పెట్టుకో నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ!

0

పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాకి డెఫినిషన్ ఇవ్వాలంటే పూరి జగన్నాథ్ వైపే చూపిస్తారు అంతా. ఆయన ఎంచుకునే కథాంశం అందులో చూపించే పాత్రలు.. సన్నివేశాలు పాటలు యాక్షన్ ప్రతిదీ మాస్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టిస్తాయి. స్క్రీన్ పై విజువల్ ని పరిగెత్తించే అరుదైన టాక్టీస్ కూడా పూరీకే తెలిసిన విద్య. స్లో అనే పదమే వినిపించదు. పరుగులు పెట్టించడం ఆయన స్టైల్.

వీటన్నిటినీ మించి పూరి జగన్నాథ్ వినిపించే డైలాగులు ప్రతిదీ ఓ ఆణిముత్యం. ఆయన అనుభవాల్లోంచి పుట్టుకొచ్చే పదజాలం జనాల్ని కేస్ స్టడీలోకి దించేసేంత ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే దర్శకులు ఎందరు ఉన్నా పూరీ వేరే అని అభిమానించే ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. కొన్ని వరస పరాజయాలు ఇటీవల ఇబ్బంది పెట్టినా.. వ్యక్తిగత జీవితంలో భాగస్వాములు మోసాలు చేసినా పూరి కంబ్యాక్ అయిన తీరు ఇంట్రెస్టింగ్.

ఇస్మార్ట్ శంకర్ విజయం పూరికి పునరుజ్జీవనం లాంటిది. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పూరి పేరు జాతీయ స్థాయిలో మార్మోగడం ఖాయంగా భావిస్తున్నారు. ఇక ఈ మూవీ సెట్స్ లో ఉండగానే మరో ఇద్దరు ముగ్గురు హీరోలతోనూ పూరి మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు వారసుడు ఆకాష్ ని హీరోగా పెద్ద స్థాయికి తీర్చిదిద్దే బాధ్యతను పూరి నెరవేరుస్తుండడం ఇంట్రెస్టింగ్. 28 సెప్టెంబర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు #HBDPuriJagannadh #PJ37 హ్యాష్ ట్యాగ్స్ ని వైరల్ చేస్తున్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాల పోస్టర్లతోనే పూరి జగన్నాథ్ బర్త్ డే కామన్ DP ని అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు. లెవెంథ్ మైల్ అని యూత్ కి బోధించిన పూరిని తలవని వాళ్లు ఉంటారా? గుర్తు పెట్టుకో నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ! అంటూ ఉద్వేగాన్ని కసిని పెంచిన గ్రేట్ మ్యాన్ పూరి. లక్ష్యం విషయంలో ఆయనెంత కసిగా ఉంటారో ప్రతి అడుగు చెబుతూనే ఉంటుంది.