Templates by BIGtheme NET
Home >> Cinema News >> రాధా కృష్ణా ట్రైలర్ టాక్

రాధా కృష్ణా ట్రైలర్ టాక్


కొయ్య బొమ్మల తయారీ అనగానే ఆంధ్రప్రదేశ్ లో ఏటి కొప్పాక .. తెలంగాణలో నిర్మల్ ప్రాంతం గుర్తుకొస్తాయి. కళను నమ్ముకుని బతికే కళాకారుల వెతలు కళ్ల ముందు మెదులుతాయి. చేతివృత్తులకు కళలకు ఆదరణ ఉన్న రోజులా ఇవి? అందుకే ఈ రంగాలకు ఎదుగుదల లేదు. అయితే అలాంటి ఒక సామాజిక అంశాన్ని స్పృషిస్తూ చక్కని ఎమోషన్స్ తో రూపొందిస్తున్న సినిమా `రాధాకృష్ణ`.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి విడుదల చేశారు. అనురాగ్ రాజ్పుత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సంపూర్ణేష్ బాబు .. ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ముస్కాన్ సేథీ (పైసా వసూల్ ఫేమ్) కథానాయిక. ఈ చిత్రంలో ప్రసాద వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హరిని ఆరాధ్య క్రియేషన్స్- శ్రీనివాస క్రియేషన్స్ బ్యానర్లపై శ్రీనివాస్ కానురు- పుప్పాల సాగరికా నిర్మిస్తున్నారు. `ఢమరుకం` శ్రీనివాస రెడ్డి సమర్పకుడు దర్శకత్వ పర్యవేక్షకుడిగా కొనసాగుతున్న చిత్రమిది.

ట్రైలర్ ఆద్యంతం నాయకానాయికల ప్రేమకథ.. నిర్మల్ బొమ్మల కథ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే మచ్చ అంటూ పార్ట్ టైమ్ కామెడీతో హీరోయిన్ పుట్టుమచ్చ ఎలిమెంట్ క్లాసిక్ డేస్ వంశీ- లేడీస్ టైలర్ ఎలిమెంట్ ని గుర్తు చేస్తోంది. ఇందులో చక్కని ప్రేమకథకు తగ్గట్టు ఎం.ఎం.శ్రీలేఖ ఆహ్లాదకరమైన సంగీతం ప్లస్ కానుంది. అయితే నవతరం ట్యాలెంట్ తో రూపొందించే చిత్రాల్లో బిగి సడలని స్క్రీన్ ప్లే తో పాటు చక్కని కామెడీ ఎంటర్ టైన్ మెంట్ వర్కవుట్ చేయాలి. ఆ ఎలిమెంట్ మూవీ ఆద్యంతం పండితేనే సక్సెస్ కుదురుతోంది. మరి ఈ మూవీలో లవ్ కామెడీ ఎమోషన్స్ ని దర్శకుడు ఎలా ఆవిష్కరించారన్నది సక్సెస్ ని నిర్ణయిస్తుంది.