నితిన్ ‘చెక్’ నుంచి రకుల్ సీరియస్ లుక్…!

0

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. తెలుగులో మహేష్ బాబు – రవితేజ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – నాగచైతన్య – రామ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఐదేళ్ల పాటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ప్రస్తుతం అర డజను సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. యూత్ స్టార్ నితిన్ తో కలిసి ”చెక్” అనే సినిమాలో నటిస్తోంది. నేడు రకుల్ ప్రీత్ సింగ్ 30వ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘చెక్’ నుంచి కొత్త పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేశారు

ఈ పోస్టర్ లో రకుల్ చాలా కొత్తగా అందంగా కనిపిస్తోంది. అంతేకాకుండా చేతిలో ఓ ఫైల్ పట్టుకొని చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తుంది. థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం జాన్ అబ్రహాంతో కలిసి ‘ఎటాక్’ మరియు అర్జున్ కపూర్ తో మరో హిందీ సినిమాలో నటిస్తోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్ 2’ మరియు శివ కార్తికేయన్ ‘అయలాన్’ చిత్రంలోనూ రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రమేష్ సిప్పి దర్శకత్వంలో రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించిన ‘సిమ్లా మిర్చి’ షూటింగ్ కంప్లీట్ చేసింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ – క్రిష్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.