ధ్యానముద్రలో యూనివర్శ్ ని తాకిన రకుల్

0

సైజ్ జీరో భామ అనగానే బెబో కరీనా కపూర్ గుర్తుకు రావాల్సిందే. మలైకా, శిల్పా శెట్టి లాంటి భామలు యోగా క్వీన్స్ గా రాణించినా బెబో రేంజులో సైజ్ జీరోకి అయితే రాలేదు. అందుకే కరీనా యూనిక్ నెస్ గురించి యువతరం ఇప్పటికీ ముచ్చటించుకుంటుంది. బెబో తర్వాత చాలామంది ప్రయత్నించినా అది కొంతవరకే సాధ్యమైంది. ఇటీవల మమ్మీ అయ్యాక కూడా అదే రూపలావణ్యం మెయింటెయిన్ చేస్తూ కరీనా ఆశ్చర్యపరుస్తోంది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో షాక్ కి గురి చేస్తోంది. సైజ్ జీరో లుక్ తో బెబోకే చెమటలు పట్టించే రేంజులో కనిపిస్తోంది. ఎంత స్ట్రిక్టుగా యోగాసనాల్ని ప్రాక్టీస్ చేసిందో.. అంతే స్ట్రిక్టుగా డైట్ పాటిస్తూ నియమబద్ధంగా ఎక్సర్ సైజులు చేస్తూ ఈ రూపానికి మారాల్సి ఉంటుంది. అందుకోసం కఠోర తపస్సునే చేస్తోంది రకుల్.

క్విట్ ది మైండ్ అండ్ ది సోల్ విల్ స్పీక్.. అంటూ లవ్ ఈమోజీని రకుల్ షేర్ చేసింది. మెడిటేషన్ మిమ్మల్ని ఇన్నర్ యూనివర్స్ కి కనెక్ట్ చేస్తుందని తెలిపింది. రకుల్ ప్రస్తుతం ముంబై టు హైదరాబాద్ కెరీర్ పరంగా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమైన రకుల్ అట్నుంచి వికారాబాద్ అడవుల్లో షూటింగుకి వెళ్లిందట. సాయి తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.