టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్స్

0

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. రోజకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్న ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్టార్ స్టేటస్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలామందే ఉన్నా స్టార్ హీరోయిన్స్ మాత్రం సరిగ్గా లెక్కపెడితే అర డజన్ మంది కూడా లేరు. అయితే మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీ కావడం.. సక్సెస్ ఆధారంగా నడిచే ఇండస్ట్రీ కావడంతో క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ప్రతి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే స్టార్ హీరోయిన్లు హీరోలతో పోటీగా పారితోషకాలు డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తెలుగులో ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాం.

ప్రస్తుతం తెలుగులో అక్కినేని సమంత – అనుష్క – పూజాహెగ్డే – కాజల్ అగర్వాల్ – తమన్నా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. వీరిలో సమంత పెళ్లైన తర్వాత కూడా వరుస ఆఫర్స్ తో అదరగొడుతోంది. సామ్ ఒక్కో సినిమాకు 2.5 నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటుంది. ఇక అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ హీరోతో పనిలేదు అనే ఇమేజ్ తెచ్చుకుంది. అందుకే ఈ బొమ్మాళి ఒక్కో సినిమాకు దాదాపు 3 కోట్ల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన పూజాహెగ్డేకి కూడా సినిమాకి 2 నుంచి 2.5 కోట్ల వరకు అందిస్తారని తెలుస్తోంది.

కాజల్ అగర్వాల్ కూడా ఎప్పుడూచేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. ఈ చందమామ ఒక్కో మూవీకి 1 నుంచి 1.5 కోట్ల వరకు తీసుకుంటుంది. మిల్కీబ్యూటీ తమన్నా కూడా సినిమాకి కోటి నుంచి కోటిన్నర వరకు డిమాండ్ చేస్తుంది. టాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ అందుకునే ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ – రష్మిక మందన్నా – రకుల్ ప్రీత్ సింగ్ – సాయి పల్లవి – రాశిఖన్నా కూడా ఉన్నారు. వీరందరూ సినిమాని బట్టి కోటి పైనే తీసుకుంటున్నారు. నివేదా థామస్ – నిధి అగర్వాల్ – నభా నటేష్ – అదితి రావు హైదరీ – పాయల్ రాజ్ పుత్ లు కుడా ఈ జాబితాలోకి చేరిపోయారు. ఈ బ్యూటీస్ 60 లక్షల నుంచి 80 లక్షల మధ్య డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి తెలుగులో ఇప్పుడు హీరోయిన్లు కొందరు హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారని చెప్పవచ్చు.