సుశాంత్ : సంజనాను ఇరికించే ప్రయత్నం చేస్తోన్న రియా

0

సుశాంత్ మృతి కేసులో సీబీఐ వారి దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. ఇలాంటి సమయంలో రియా వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. గత నెలన్నర రోజులుగా కనీసం మీడియా ముందుకు రాని రియా ఇప్పుడు మాత్రం మీడియాకు పిలిచి ఇంటర్వ్యూలు ఇవ్వడంపై పలువురు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె తనపై వస్తున్న వార్తలు మరియు ఆరోపణలను కొట్టి పారేయడంతో పాటు తనపై జనాల్లో పాజిటివ్ దృష్టి కలిగేలా ప్రయత్నాలు చేస్తోంది అంటూ సుశాంత్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

రియా తాజా ఇంటర్వ్యూలో సుశాంత్ చివరి సినిమా దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీపై ఆరోపణలు చేసింది. దిల్ బేచారా షూటింగ్ సమయంలో సుశాంత్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అంటూ సంజనా సంఘీ మీటూ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలో సుశాంత్ చాలా డిప్రెషన్ కు గురయ్యాడు. ఆ సమయంలో చాలా మానసిక ఒత్తిడిని అనుభవించాడు. సంజనా ఎందుకు వెంటనే ఆ విషయమై స్పందించలేదు అంటూ రియా ప్రశ్నించింది. సంజనా మీటూ ఆరోపణల తర్వాత సుశాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా చెడిపోయిందని రియా పేర్కొంది.

తనపై రియా చేసిన విమర్శలపై సంజనా స్పందించింది. తాను అమెరికా వెళ్లి వచ్చిన వెంటనే విషయం తెలిసి సుశాంత్ గురించి తాను మీటూ ఆరోపణలు చేసినట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాను. ఇప్పటికే ఏం చెప్పాలో అది చెప్పాను. అయినా నన్ను ఇందులోకి లాగాలని ప్రయత్నాలు చేయడం ఏమాత్రం సబబు కాదని ఆమె పేర్కొంది. సుశాంత్ మంచి వ్యక్తి అని అతడు చాలా మృదు స్వభావం కలిగి ఉండేవాడు. ఆయనతో సినిమాలో నటించే సమయంలో ఆయన వ్యక్తి గత జీవితం గురించి తెలుసుకునే అవకాశం రాలేదని సంజనా పేర్కొంది. సుశాంత్ కేసులో నింధితులకు శిక్ష పడాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది.