సలోనితో మర్యాద కృష్ణయ్య జోడీ రిపీట్.. కలిసొచ్చే వేళ!

0

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. హీరోగా సునీల్ కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే కాలక్రమంలో సునీల్ కి సరైన హిట్లు లేక కెరీర్ పరంగా డైలమాలో పడిపోయిన సంగతి విధితమే.

ఇక సునీల్ తో ఇంతకుముందు ఓ ఫ్లాప్ సినిమా తెరకెక్కించిన పీపుల్స్ మీడియా సంస్థ ఇప్పుడు `మర్యాద కృష్ణయ్య` అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఇటీవలే టైటిల్ ని రివీల్ చేయడంతో ఈసారి సునీల్ ఏం చేస్తాడో? అంటూ చర్చా వేడెక్కించింది.

ఆసక్తికరంగా ఈ మూవీలో సునీల్ సరసన సలోని కథానాయిక. మర్యాద రామన్న రిలీజైన పదేళ్లకు తిరిగి అదే జోడీ రిపీటవుతోంది. సునీల్ కి మరోసారి సలోని లక్కీ ఛామ్ అవుతుందా? అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో సునీల్ ఒక చిలిపి దొంగగా కనిపిస్తాడని సమాచారం. ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా మర్యాద రామన్నను గుర్తు చేసినా కానీ థీమ్ పరంగా యూనిక్ గా వెళుతున్నారట. ఫన్ వర్కవుటై .. సలోని అందచందాలు యూత్ కి కనెక్టయితే సునీల్ కి కలిసొస్తుందేమో! అన్న చర్చా సాగుతోంది.

హీరోగా ఫెయిలయ్యాక క్యారెక్టర్లతో కంబ్యాక్ అవ్వాలన్నా కుదరలేదు. కనీసం ఇప్పుడు సోలో హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. మరోసారి మర్యాద రామన్న మ్యాజిక్ రిపీటైతే సునీల్ పంట పండినట్టే.