సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు సమంత

0

సమంత జాను సినిమా తర్వాత కొత్త సినిమాకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కాస్త టైం తీసుకోవాలనుకున్న సమంతకు కరోనా కారణంగా చాలా సమయం దొరికింది. దాదాపు ఏడు ఎనిమిది నెలలుగా సమంత కెమెరా ముందుకు రాలేదు. ఈ లాక్ డౌన్ టైంలో సమంత రూఫ్ గార్డెన్ ను నిర్వహించడంతో పాటు పలు యాక్టివిటీలు చేస్తూ బిజీ బిజీగా గడిపింది. ముఖ్యంగా సమంత ఆరోగ్యంను రక్షించుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది. మరో వైపు సమంత బిజినెస్ లో కూడా దిగింది. తన సొంత క్లాత్ స్టోర్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యింది. సాకి అనే పేరుతో స్టోర్స్ ను ప్రారంభించబోతుంది.

తన సొంత సంస్థ సాకి కోసం సమంత యాడ్ ఫిల్మ్ లో నటిస్తోంది. ఆమద్య ఒక ఫొటో షూట్ లో కనిపించినా చాలా కాలం తర్వాత ఒక రెగ్యులర్ షూటింగ్ లో సమంత పాల్గొంది. సమంత సాకి కోసం ప్రముఖ ఫిల్మ్ మేకర్ సారధ్యంలో యాడ్ ఫిల్మ్ ను చేస్తోంది. ఆమె ను చాలా కొత్తగా ఆయాడ్ ఫిల్మ్ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇప్పటి వరకు సమంత చాలా యాడ్స్ లో నటించింది. మొదటి సారి తన సంస్థ కోసం తానే యాడ్ లో నటించబోతుంది. కనుక ఎప్పటి కంటే విభిన్నంగా కనిపించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే సాకి కోసం తీసుకున్న ఫొటో షూట్స్ బయటకు రాబోతున్నాయి.