Templates by BIGtheme NET
Home >> Cinema News >> సప్తగిరి హీరోగా బహుభాషా చిత్రం ‘ఎయిట్’..!

సప్తగిరి హీరోగా బహుభాషా చిత్రం ‘ఎయిట్’..!


కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ ‘సప్తగిరి ఎల్ఎల్బి’ ‘వజ్రకవచధర గోవింద’ వంటి సినిమాల్లో సప్తగిరి హీరోగా నటించాడు. ఒకవైపు కామెడీ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోగానూ కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా సప్తగిరి ప్రధాన పాత్రలో ‘ఎయిట్’ అనే బహుభాషా చిత్రం అనౌన్స్ చేశారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4 గా వస్తున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నాడు. ఇల్యూజన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహించనున్నారు. ఇది తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీ భాషల్లో రూపొందించనున్నారు.

‘ఎయిట్’ టైటిల్ ని ఖరారు చేసిన మేకర్స్ టైటిల్ పోస్టర్ ను ఈరోజు గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్ డిఫరెంట్ గా ఉండటంతో పాటు సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. సప్తగిరికి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రంలో కామెడీని కూడా జోడిస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావడం వల్లే నాలుగు భాషల్లో నిర్మిస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి ఎన్.ఎస్. ప్రసు సంగీతం సమకూరుస్తున్నారు. నజీర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. వంశీ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘సూపర్ మచ్చి’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అలానే పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘సుందరి’ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.